ద్వారకా తిరుమలేశుని దర్శించుకున్న షర్మిల

ద్వారకా తిరుమల, 18 మే 2013:

రెండో తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీమతి వైయస్ షర్మిల శనివారం దర్శించుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో శనివారం 152వ రోజుకు చేరింది. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు ఆమె వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.  గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర సాగుతుంది.  రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా 12.2 కిలో మీటర్లు షర్మిల నడుస్తారు. కొత్త గూడెం గ్రామంలో  ఆమె శనివారం రాత్రి బస చేస్తారు.

Back to Top