మోసగాడిని నమ్మొద్దు!


చంద్రబాబు రంగులు మార్చే రాజకీయ ఊసరవెల్లి..
చంద్రబాబు పాలనలో  పోస్టింగ్‌లు లేవు...ఊస్టింగ్‌లే..
అవినీతిమయంగా పోలవరం ప్రాజెక్టు...
రాజధాని కోసం శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు
బాహుబలి  అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తారు
నాలుగు ఇస్తీ్రపెట్టెలు, కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్టేనా 
 ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేశాడు
 ఆరోగ్యశ్రీ పూర్తిగా పడేకేసింది

శ్రీకాకుళంః

చంద్రబాబు రంగులు మార్చే రాజకీయ ఊసరవెల్లి అని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. ఈ రోజు నరసన్న పేటలో తిరుగుతూ ఉంటే ఆ దివంగత నేత నాన్నగారు వైయస్‌ఆర్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రజలు చెప్పుకున్నారు.నాన్నగారి చేపట్టి కార్యక్రమాలన్ని నాకు ఒక వైపు చెబుతూ ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీ చీకటి పాలన బేరీజు వేసుకున్నారు. వ్యవసాయాన్ని మీద బతికే ఈ ప్రాంతంలో  నాన్నగారి కృషిని నేటికి కూడా మరిచిపోలేవన్నా అని అన్నారు.  టీడీపీ ప్రభుత్వం వంశధారలో పుష్కలంగా నీరున్నా ఏ రోజు కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒరిస్సా ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే ఒరిస్సాలో నవీన్‌పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు కూడా బీజేపీ ప్రభుత్వంలో వాజ్‌పేయ్‌  సారధ్యంలో కలిసే ఉన్నారన్నా  కనీసం మేలు చేయాలనే ఆలోచన చేయలేదన్నా అని అన్నారు. నాన్నగారు వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశధారను మొదలుపెట్టారని,  2005లో శంకుస్థాపన చేశారన్నారు. వంశధార నది మీద సైడ్‌ వ్యూయర్‌  నిర్మించి హిరా మండలంలో రిజర్వాయర్‌ కట్టి వంశధార నీళ్లను తరలించి మాకు మేలు చేసే పని చేశారన్నా అని అన్నారన్నారు. వంశధార కట్టడానికి 930 కోట్ల రూపాయలు కేటాయించారని,  700 కోట్ల ఖర్చుచేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారన్నారు. ఆ తర్వాత నాన్నగారి మరణం తర్వాత   మిగిలిపోయిన 55 కోట్లుతో  వంశధార ప్రాజెక్టుతో మేలు చేయాలనే ఆలోచన వదిలి డబ్బులు ఎలా తిన్నాలని చూశారన్నారు.  55 కోట్ల పనులను 470 కోట్ల రూపాయలకు పెంచారని, కాంట్రాక్టర్‌ తన బీనామీ అయినా సీఎం రమేష్‌ఖు అప్పగించారన్నారు. వంశధార ప్రాజెక్టు అవినీతిమయం అయి  నత్తనడకన సాగుతుందన్నారు. 

నరసన్నపేట నియోజకవర్గంలో ఆరు ఓపెన్‌ హెడ్‌ కాల్వలు ఉంటే వీటిని వంశధార ప్రాజెక్టుకు అనుసంధానం చేసింది వైయస్‌ఆర్‌ అని, వీటి ఆధునీకరణ 2007–08లో 33 కోట్ల మంజూరు చేసి దివంగత నేత వైయస్‌ఆర్‌ ఎంతో మేలు చేశారన్నారు. జులుమూరు పోలాంకి, నరసన్నపేట మండలాల్లో కరకట్ల నిర్మాణం కోసం అప్పట్లో 56 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 20 శాతం పనులు కూడా ఇంకా పూర్తికాలేదన్నారు. ఎంతంటి దారుణంగా ఈ ప్రభుత్వం ఉందో తెలుస్తుందన్నారు. ఏ పనైనా మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా పూర్తిచేయాలని నాన్నగారు చెప్పేవారని,  మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశ«ధార పెండింగ్‌ పనులు,నేరేడు బ్యారేజ్‌ అన్ని పనులు  నేను చేయిస్తాను అని చెప్పతున్నా.ఇదే ప్రాజెక్టు గురించి రైతన్నలు చెబుతున్నారు.
నరసన్నపేట నియోజకవర్గంలో ఎత్తులో  ఉన్న పంట పొలాలకు నీరు ఇవ్వడానికి వంశ«ధార ఎడమ కాల్వ మీద 8 లిప్ట్‌లు పెట్టి రైతులకు తోడుగా ఉన్నారన్నా. టీడీపీ పాలనలో ఆ లిప్ట్‌ ప్రాజెక్టులు నేడు సరిగ్గా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఆరువేల ఎకరాలు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే జిల్లాలో ఇన్ని సీట్లు  ఇచ్చి చంద్రబాబును గద్దెనెక్కిస్తే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్షరాల 38వేల ఇళ్లను కట్టించారు. అటువంటింది చంద్రబాబు నాలుగున్నరేళ్ల కాలంలో  కనీసం ఊరికి రెండు,మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. చంద్రబాబు ఇదే నియోజకవర్గానికి వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన హామీలు చూస్తే..నరసన్నపేట మండలంలో రాజాను చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ పనులు జరిగాయా అని అడుగుతున్నా..జగన్నాధపురంలో 5 వీధుల్లో మంచినీరు సమస్యల తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2 సార్లు ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి. ఆ ప్రతిపాదనలు చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి. నరసన్నపేట నగరానికి రింగ్‌ రోడ్డు వేశాడా అని అడుగుతున్నా..
    రంగసాగరం ఎత్తిపోత్తల పథకానికి శంకుస్థాపన చేశారు.. ఫోజులు కొడుతూ పోటోలు దిగాడు ఒక రూపాయి అయినా ఇచ్చారా అని అడుగుతున్నా. గిరిజన ప్రాంతాలకు మరో పిహెచ్‌ఇ ఇస్తానని చెప్పి ఇవ్వలేని ప్రపంచ చ్రరితలో  ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా. జనమూరి మండలంలో రైల్వే ట్రాక్‌పై ప్లెఓవర్‌ వంతెన నిర్మిస్తానన్నారు. కనబడిందా అన్ని అడుగుతున్నా. ఒకటి మాత్రం జరిగిందన్న ఇసుక ర్యాంపుల నుంచి విశాఖ పట్నం ఇసుక తరలిపోతున్నాయని ప్రజలు అన్నారన్నారు.. ఇసుకను దోచేస్తున్నారని, విశాఖపట్నంలో లారీ అక్షరాల 40 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. లంచాలు ఎమ్మెల్యే నుంచి కలెక్టర్‌ దాకా, కలెక్టర్‌ నుంచి చిన్నబాబు, చిన్నబాబు నుంచి పెద్ద బాబు దాకా లంచాలు పోతున్నాయి. పెద్ద మనిషి చంద్రబాబు మైక్‌ పట్టుకుని ఉచితంగా ఇస్తారంటా..ఇసుక మాత్రం ప్రీగా చినబాబు,పెద్దబాబుకు వస్తోంది. రైతులకు ఇవ్వలసిన మినుమలు మద్దతు ద్వారా మ ంత్రి అచ్చెంన్నాయుడు మింగేసాడన్న అని చెప్పుకొచ్చారు. రైతుల నుంచి క్వింటాల్‌ మినుములు 2వేల 500 నుంచి మూడువేల నుంచి కొనుగోలు చేస్తారు.. దళారీలు కొనుగోలు చేసినపుపడు వీరు ఎవరూ మాట్లాడరు.సరైన సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయదు. రైతులకు ఇవ్వాల్సిన మినుముల  మద్దతు ధరను స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు మింగేశారు. రైతులు ఆందోళనæ చేస్తే ఈ బాగోతం బయటకు వచ్చింది.కాని ఇప్పటి వరుకు మంత్రి మీద గాని, ఆయన అనుయులు  మీద గాని ఒక కేసు కూడా నమోదు కాలేదు.ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు హయాంలో చంద్రబాబు దగ్గర ఉండి అక్షరాల 36 స్కూళ్లను మూయించివేశాడు.ఒక ముఖ్యమంత్రిగా  ప్రభుత్వ పాఠశాలను బాగుచేయాలి. మంచి ఆలోచన చేయాలి. చంద్రబాబు కళ్లు హాస్టళ్లపై కూడా పడ్డాయి.ఇదే నియోజకవర్గంలో మూడు హాస్టళ్లు మూయించివేశారు.పిల్లలకు మేలు చేయాలి అనే ఆలోచన లేకుండా వారి భవిష్యత్‌కు బాటలు వేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పాలనలో జరుగుతున్నా అభివృద్ధి ఇదే. తిత్లీ తుపానులో ఆదుకుంటుందని ఎదురుచూశామని ప్రజలు చెప్పారు. నర్సన్నపేట నియోజకవర్గంలో 38వేల పంట నష్టం జరిగితే 16 ఎకరాలను ఎమ్యూరేషన్‌ కూడా చేయ లేదన్నారు. తిత్లీ తుపాను నష్టపోయింది 3,435  కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, ప్రజలు ఇబ్బందిపడ్డారని కేంద్రానికి చంద్రబాబు లేఖరాశారు. 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందే చంద్రబాబు ఎంత  ఇచ్చారు. నష్టం వాటిల్లిందే 500 కోట్లు  కూడా రైతులకు,ప్రజలకు చంద్రబాబు పంపిణీ చేయలేదు.ఇక్కడకు వచ్చిన చంద్రబాబను బాధితులు నిలదీసి,  నిరసన తెలిపితే   బాధితుల ఫోటోలను  వెనుకల నుంచి ఫొటోలు తీసి ఆ ఫోటోలను ప్లెక్సీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులపై, ఉత్తరాంధ్రలో ఫోటోలు పెట్టి శ్రీకాకుళం జిల్లాను ఆదుకున్న చంద్రబాబు అంటూ ప్రచారం చేస్తాడు. ఆదుకునేది లేదు. చంద్రబాబు పబ్లిసిటీ చూస్తే ఒక సామెత ఉంది.  శవం మీద కూడా మీద చిల్లర ఏరుకునే  విధంగా చంద్రబాబు తీరు ఉంది. తుపాన్‌ వచ్చి  రెండు నెలలయినా ఈ జిల్లా రైతుల వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు కూడా ఇవ్వలేదు. ఎంతటి దారుణంగా పరిపాలన ఉందో చూడండి..చంద్రబాబు నాయుడు పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ నియోజకవర్గమే ఒక ఉదాహరణ. నాలుగేళ్లన్నర సంవత్సరాలు అయిపోయింది. ఫిబ్రవరిలో షెడ్యూల్‌ వస్తుంది. నాలుగు,ఐదు నెలలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఒకసారి ఆలోచన చేయమంటున్నా.రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుందని గుండెలపై చేయి వేసుకుని జరుగుతున్న పాలన గురించి ఆలోచన చేయాలి. రుణాల మాఫీ లేదు. గత ఎన్నికల ముందు రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీల్లో స్వరం వినిపించేంది. ఈ రోజు అడుగుతున్నా బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నా..ప్రజలు మాత్రంం బంగారం వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయంటున్నారు. రుణామాఫీ అయ్యిందా అని అడుగుతున్నా..గతంలో రైతులకు, పొదుపు సంఘాలకు సున్నా శాతం వడ్డీలు,పావలా వడ్డీలకు రుణాలు వచ్చేవి. ఈ నాలుగున్నరేళ్లలో రైతులకు రుణామాఫీ కాలేదు. సున్నా,పావలా వడ్డీలు కూడా లేకుండా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. రెండు పంటల్లో తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంది. ఆ ప్రాంతాలకు చంద్రబాబు వెళ్లడు.ఆ రైతులకు రెండువేల కోట్ల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలివస్తే ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. పంటలకు మద్దతు ధర లేదు. ఖరీఫ్‌ చేతికొచ్చిన కోనుగోలు కేంద్రాలు లేవు. దళారీలకు తక్కువ రేటుకు అమ్ముకోవలసి పరిస్థితి. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. గిట్టుబాటు ధర కల్పించిన  ప్రభుత్వం ప్రభుత్వమే దళారీ రూపం ఎత్తింది .రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి  ప్యాక్‌ చేసి మూడు,నాలుగు రెట్లు ఎక్కువ ధరలకు హెరిటేజ్‌ షాపుల్లో అమ్ముతారు..ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రంలో రెండున్నర లక్షలు ఉద్యోగలు ఖాళీగా ఉంటే ఒక ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.  23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నాలుగున్నర సంవత్సరకాలంలో ఎన్నికలకు  3 నెలల మందు  7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు..సిలబస్‌ మర్చి,  షెడ్యూల్‌ను పదేపదే వాయిదా వేస్తూ డీఎస్సీ అభ్యర్థులను అష్టకష్టాలు పెడుతున్నారు .చంద్రబాబు హయాంలో పోస్టింగ్‌లు ఎక్కడ ఇవ్వలేదు.ఊస్టింగ్‌లు మాత్రం కనిపిస్తున్నాయి.బాబు వచ్చాడు 30వేల మంది ఆదర్శరైతుల ఉద్యోగాలు గోవిందా. గృహనిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్పస్పెక్టర్లు,కంప్యూటర్‌ ఆపరేటర్ల 3,500 ఉద్యోగాలు గోవిందా..1000 మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవిందా.. 4500 ఉపాధి హామీ ఫిల్డ్‌ ఉద్యోగాలు గోవిందా..ఆయుష్‌లో 8 మంది ఉద్యోగాలు గోవిందా.. 85 వేల  మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగాలు గోవిందా.. దాదాపు సాక్షరభారత్‌లో పనిచేస్తున్నా 30వేల మంది అక్కాచెల్లెమ్మలు ఉద్యోగాలు గోవిందా. పోలవరం ప్రాజెక్టు పనులు పునాది గోడలు దాటలేదు .పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారింది.మంత్రి యనమల వియ్యంకుడు సబ్‌ కాంట్రాక్టర్‌ అవతారమెత్తారు.రాష్ట్ర రాజధాని పేరుతో చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు.బాహుబలి  అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తారు. రాజధాని కోసం శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు.నాలుగు ఇస్తీ్రపెట్టెలు, కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్టేనా అని ప్రశ్నిస్తున్నా. ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేశాడు. ఆరోగ్యశ్రీ పూర్తిగా పడేకేసింది.నియోజకవర్గంలో ఉన్న అంబులెన్స్‌లు 2,అందులో ఒకటి చెడిపోయింది.రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏదీ ఇవ్వరు.వేలిముద్రల పేరుతో బియ్యంలో కోత పెడుతున్నారు. గ్రామాల్లో పరిపాలన చూస్తే తాగడాని  మంచినీళ్లు ఉండవు, గ్రామాల్లో కనిపించేంది వీధి చివర, బడి,గుడి పక్కన  వైన్‌షాపులు మాత్రం కనిపిస్తాయి. ఈరోజు రాష్ట్రం దారుణమైన పరిస్థితిలో ఉంటే గాలికొదిలేసి తమిళనాడు కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరణకు చంద్రబాబు వెళ్లారంట. రాష్ట్రంలో ప్రజలు ఓటు వేస్తే వారిని ఆదుకోవలసింది పోయి..దేశ రాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతాడు. ఈ రెండు సరిపోవడం లేదు అన్నట్లు  అంతరిక్ష రాజకీయాలు కూడా చంద్రబాబు చేసే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎన్నికలు జరిగాయి.. చంద్రబాబు గిమ్మిక్కులు చూశారు. ఊసరవెల్లి కన్నా స్పీడుగా రంగులు మార్చాడు. తన రాజకీయ సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఒక మాట, బొర్లా పడిన తర్వాత మరో మాట మాట్లాడతారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖారారుకు ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు నానా విధాల ప్రయత్నాలు చేశాడు. కాని ఆ పొత్తు జరగకుండా మోదీ అడ్డుకున్నాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్నారు. బావమరిది హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆయన భౌతికాయం పక్కనే ఉన్నప్పుడు కేటిఆర్‌తో చంద్రబాబు పొత్తుల కోసం మాట్లాడాడు. కేటీఆర్‌ చంద్రబాబుతో పొత్తు ససేమీరా అనడంతో తర్వాత  రెండు నెలలకు ఢిల్లీకి వెళ్ళి ఏ మాత్రం సిగ్గులేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగి రాజకీయాలు చేశాడు. తెలంగాణలో రాహుల్‌ గాంధీతో కనబడ్డాడు.  కాంగ్రెస్‌ పార్టీ 2018 జూన్‌ 8న చంద్రబాబు అవినీతి మీద పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకంపై రాహుల్‌ గాంధీ ఫోటో కూడా ఉంది. అదే వ్యక్తి రాహుల్‌గాంధీ, చంద్రబాబు జతకలిసి తిరిగారు.. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలంగాణలో ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు సరైన బుద్ధిచెప్పారన్నారు. ప్రత్యేకహోదా టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని చంద్రబాబు అంటున్నారు.అదే టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు ఎందుకు వెంపర్లాడారు అని ప్రశ్నించారు. చంద్రబాబు బీజేపీతో కలిస్తే. బీజేపీ మంచింది..కాంగ్రెస్‌తో కలిస్తే కాంగ్రెస్‌ మంచింది.చంద్రబాబు మురికికాల్వలో దూకితే గంగానది అంటారు.ప్రతీ పేదవాడి ముఖంలో  చిరునవ్వు చూడాలని నవరత్నాల పథకాలు ప్రకటించాం. అధికారంలోకి రాగానే వైయస్‌ఆర్‌ చేయూత పేరుతో ప్రతీ ఊర్లో గ్రామ  సచివాలయాలు ఏర్పాటు చేస్తాం.గ్రామ సచివాలయాలు ద్వారా ప్రభుత్వం పథకాలు మంజూరు చేస్తాం.ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. వాలంటీర్లకు ప్రతీ నెల రూ, 5వేలు ఇస్తాం.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల్లో ప్రతీ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం..కార్పొరేషన్ల వ్యవస్థలో  పారదర్శకత తీసుకొస్తాం.45 ఏళ్లు నిండి ప్రతీ అక్కకు సంవత్సరానికి రూ.75వేలు ఇస్తాం. నాలుగు దఫాలుగా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top