వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు భారీ ఎత్తున యువత తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయం వద్ద బారులు తీరారు ప్రజల నుంచి వైయస్ జగన్ వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్ జగన్‌కు ప్రజలు ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వైయస్ జగన్.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వైయస్ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయులు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైయస్ జగన్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైయస్ జగన్‌కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైయస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా, రేపు(జులై 8, బుధవారం) ఉదయం వైయస్ జగన్.. పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.