కొడాలి నానిపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపులు 

 విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఉపా చట్టాన్ని హేళన చేశారంటూ, పవన్ కళ్యాణ్‌ను విమర్శించారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయించింది. సోషల్‌ మీడియాపై డీజీపీ, ఉన్నతాధికారుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ జరిగింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం, టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

Back to Top