దివంగ‌త మ‌హానేత‌కు నివాళి

హైద‌రాబాద్‌ : దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కి పార్టీ అగ్ర
నేత‌లు నివాళులు అర్పించారు. హైద‌రాబాద్ పంజాగుట్ట‌లోని వైఎస్సార్
విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేశారు. అనంత‌రం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో
వైఎస్సార్ కు ఘ‌న నివాళి అర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయ‌కులు,
కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర
అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత
మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ
ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మ‌ధుసూద‌న్
రెడ్డి, ల‌క్ష్మి పార్వ‌తి, ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త
దాన శిబిరం నిర్వ‌హించారు.

Back to Top