రాజధాని ముసుగులో టీడీపీ భారీ కుంభకోణాలుబిట్టు బిట్టుకో బినామీపేదలో నోట్లో మట్టిగొట్టిన పచ్చదండువేలాది ఎకరాలను మింగేసిన చంద్రబాబు అండ్ కో
రాజధానిలో టీడీపీ భూకుంభకోణాలు తవ్విన కొద్ది బయటపడుతున్నాయి. లెక్కలేనంత అవినీతి బాగోతం వెలుగుచూస్తోంది. రాజధాని పేరుతో బినామీల పేర లోకేష్, మంత్రులు, టీడీపీ శాసనసభ్యులు సాగించిన భూదోపిడీ పాపాల పుట్ట బద్దలైంది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ నమ్మబలికి అక్కడి పేద రైతులు, దళితుల పొట్టగొట్టి.... చంద్రబాబు అండ్ కో ప్రపంచస్థాయి దోపిడీకి పాల్పడిన వైనం రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెరపర్చింది.
రాజధాని ముసుగులో బిట్టు బిట్టుకో బినామీని సృష్టించి చంద్రబాబు అతిపెద్ద అవినీతి సునామీకి తెరలేపారు. 25 వేల ఎకరాలకు పైగా పేదల భూములను కొల్లగొట్టారు. లోకేష్, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, సుజనాచౌదరి అదేవిధంగా ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, స్పీకర్ కుమారుడు కోడెల శివరామకృష్ణ, మురళీ మోహన్ మరికొంత మంది టీడీపీ భూబకాసురల బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఇప్పటివరకు బయల్పడింది గోరంతే... ఊహించని స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది...
అధికారాన్ని అడ్డంపెట్టుకొని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు రాజధానిలో వేలాదిమంది రైతులు బలైపోయారు. రైతులు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు, పోరంబోకు భూములను దొరికినకాడికి దోచుకున్నారు. రాజధాని ప్రకటనకు ముందే లీకులిచ్చి...రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతుల నోట్లో మట్టికొట్టారు. ఖరీదైన వేల ఎకరాల భూములను కారుచౌకగా కొట్టేశారు. రైతులకు పైసా, పరక చెల్లించి .... బినామీల పేర ఆరైతుల భూములను రిజిస్ర్టేషన్లు చేయించుకొని వేలకోట్లకు పడగలెత్తారు.
రాజధాని ఎక్కడ అన్నదానిపై చంద్రబాబు అండ్ కో పక్క్ ప్లాన్ తో ముందే గందరగోళం సృష్టించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం భూములకు పరిహారం రాదంటూ ప్రచారం చేసి పేద రైతులను భయాందోళనకు గురిచేశారు. దీంతో అయినకాడికి రైతులు భూములను అమ్మేసుకున్నారు. అలా పచ్చ రాబందులు వారిని మోసగించిన తమ పని చక్కబెట్టుకున్నారు. చంద్రబాబు డైరక్షన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆడిన బినామీల నాటకం ప్రతి ఒక్కరినీ కళ్లు బైర్లు కమ్మేలా చేసింది.