ప్రత్యేకహోదాను బాబు మర్డర్ చేశాడు

  • బాబు,వెంకయ్యలు ఐదుకోట్లమందికి వెన్నుపోటు పొడిచారు
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారు
  • యువభేరి సదస్సులో వైయస్ జగన్
గుంటూరుః చంద్రబాబు ప్రత్యేకహోదాను చంపేశాడని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హోదా కోసం పోరాడాల్సిందిపోయి బాబు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడని మండిపడ్డారు. గుంటూరు వేదికగా జరిగిన యువభేరి సదస్సులో వైయస్ జగన్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...

ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు.  హైదరాబాద్‌ నగరాన్ని గమనిస్తే బీబీఎల్, బీహెచ్‌ఈఎల్, ఇక్రీసాట్, సీసీఎంబీ, ఐఐసీటీ,ఈసీఐఎల్, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్‌ వంటి ఫ్యాక్టరీలో హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్‌ నగరం కానీ, బెంగుళూరు కానీ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతోనే అభివృద్ధి సాధించాయి. ఇవాళ ఇన్నిన్ని ఇన్‌ప్రాక్చర్‌ ఉన్నా గవర్నమెంట్‌ సాయం లేకపోతే ఎలా అభివృద్ధి చేయగలం. ఇవాళ ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్నో నష్టాలు చూశాం. ఈ అభివృద్ధిని ముందుకు తీసుకునే పరిస్థితి లేకపోతే భవిష్యత్తు ఏంటీ. మరో మెట్టు మనమంతా కూడా పైకి ఎదగాలి. దీనికి ప్రత్యేకహోదా ఒక్కటే బ్రహ్మాస్త్రం. ఈ ప్రభుత్వానికి ఇది తెలియనిది కాదు. గతంలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు. గతంలో వెంకయ్య కూడా పార్లమెంట్‌లో మాట్లాడారు.

ప్రత్యేక హోదా అంటే..
ప్రత్యేక హోదా అంటే ఏందీ అన్న విషయానికి వస్తే..మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో ఉద్యోగాలు రావడమే. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వేళ్లడం కాకుండా, వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేక హోదా.  ఇటువంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోరాటం చేయడం లేదు. హోదా కోసం పోరాటం చేస్తున్న వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. హోదా కావాలని బంద్‌ చేస్తే దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పుతారు. ధర్నాలు చేస్తే నీరుగార్చే ప్రయత్నాలు చేస్తారు. పిల్లలు పోరాటం చేస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా క్యాండీల్‌ ర్యాలీలు చేస్తామని పిల్లలు ముందుకు వస్తే ఇదే చంద్రబాబు దగ్గరుండి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్‌పోర్టులోనే రన్‌వేపై ఆపే కార్యక్రమం చేశారు. బాబు హయాంలో విమానాల రోకో కూడా చూశాం. ఇటువంటి బాబును చూసినప్పుడు గతంలో రోమన్‌ చక్రవర్తి గుర్తుకు వస్తారు. జూనియర్‌ సీజర్‌ తన అన్నను కత్తిపోటుతో పొడుస్తాడు.

హోదాను నీరుగార్చిన బాబు
సీఎం స్థానంలో ఉండి హోదా కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి తెలుగు జాతి కోసం పోరాడకుండా వెన్నుపోటు పొడుస్తున్నారు. హోదా సంజీవని అని ఆనాడు చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్య కూడా అన్నారు. ఇవాళ ఇదే బాబు, వెంకయ్య ఇద్దరు కలిసి ఐదున్నర కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. రాష్ట్రమంతా నివ్వెరపోయి చూస్తోంది. నాడు ఎన్‌టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపిస్తే..ఇవాళ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. టీడీపీ అన్నది చంద్రబాబు హయాంలో తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారు. ఇంత దారుణంగా మన జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా గమనించాం. ఇటీవల విశాఖలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పెట్టారు. నిరుడు 2016 జనవరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టారు. విశాఖలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పెట్టి రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఎంవోయులు సంతకాలు చేశారు అని చెప్పారు. ఇవాళ నేను చూపిస్తున్న డాటా గవర్నమెంట్‌ ఇచ్చిందే చూపిస్తున్నాను. అందులో రూ.2.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారు. ఇలా అబద్ధాలు ఆడితే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుందని అడుగుతున్నాను. ఎంవోయులు సైన్‌ చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ఐఈఎం నివేదిక ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం డాటా ఎం చెబుతుందంటే..జనవరి 1– 2016 నుంచి డిసెంబర్‌ 2016 వరకు కేవలం రూ.34464 కోట్లు మాత్రమే అని చెబుతున్నారు. వీరంతా కూడా పరిశ్రమలు పెడతారని నమ్మకం లేదు. 2015లో ఐఈఎంలు 21531 కోట్లు ఫైల్‌ అయ్యాయి. ఇందులో ఎన్ని ఇంప్లిమెంట్‌ అయ్యాయని పరిశీలిస్తే..2014లో కేవలం 2804 కోట్లు. చంద్రబాబు రూ.4.67 కోట్లకు ఎంవోయులు చేశారు. ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గరుండి అబద్ధాలు చెబుతున్న పరిస్థితి చూసి నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. ఈయనగారు చేస్తున్న మోసం 2017 జనవరిలో కూడా చూశాం. కొత్తగా ఏకంగా 10.54 లక్షల కోట్లు అన్నారు. ఇంత పెట్టుబడులు వస్తే అందరం సంతోషిస్తాం. ఎవడికి బడితే వారికి సూటు బూటు వేశారు. ఎవరికి పడితే వారికి ఎంవోయూలు చేశారు. త్రిలోక్‌కుమార్‌కు సూటుబూటు వేశారు. ఈయన విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన వ్యక్తి. నందగోపాల్‌ అనే పారిశ్రామిక వేత్త ప్రెస్‌నోట్లు ఇచ్చే వ్యక్తి. ఈయనకు సొంతంగా వాహనం కూడా లేదు. ఈయన పేరుతో ఎంవోయులు చేశారు. అలాగే మరో ఉదాహరణ గడ్డల సుధీర్‌. గుంటూరు జిల్లా సంతగూటిపాడుకు చెందిన వ్యక్తి. ఈయనకు పాత పెంకుటిల్లు. భార్య అంగన్‌వాడీ టిచర్‌. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు .చంద్రబాబు ఏకంగా మనుషులకు సూట్లు బూట్లు వేసేసి ఎరితో బడితే వారితో సంతకాలు పెట్టించేసి రూ. 10.54 వేల కోట్లు వచ్చేశాయని అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఈ మాదిరిగా చెప్పడం దారుణం.  ఆయన గవర్నమెంట్‌లో సాల్‌మన్‌ అలోక్‌రాజ్‌ అని ఇండస్ట్రీ సెక్రటరీ చంద్రబాబు మోసాలను తెలుసుకొని సంతకాలు పెట్టనని వెనక్కు వెళ్లిన పరిస్థితి. అంటే చంద్రబాబు చేస్తున్న మోసాలు, అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయనేదానికి నిదర్శనం. 

పరిశ్రమలు ఏపీకి రావాలంటే చంద్రబాబు సింగపూర్, జపాన్, దావూస్, చైనాకు పోతేనే పరిశ్రమలు వస్తాయని అనుకోవడం మూర్ఖత్వం.. చంద్రబాబు సుందర మోహారవింధాన్ని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకురారు.. లేదా జగన్‌ చెప్పాడనో ఎవరూ ముందుకురారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలంటే ఆ పరిశ్రమలు పెట్టేవాళ్లకు ప్రత్యేక హోదాతో వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు. ప్రత్యేక హోదా వస్తే ఇన్‌కంట్యాక్స్, ఎక్సైజ్‌ డ్యూటీ కట్టాల్సిన పనిలేదు. ట్రాన్స్‌పోర్టు వెనక్కు ఇస్తారు. బ్యాంక్‌ నుంచి లోన్‌ తెచ్చుకుంటే లోన్‌లో 3 శాతం సబ్సీడీ ఇస్తారు. ఇటువంటి రాయితీలు ఇచ్చినప్పుడు ఎవరైనా పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. కానీ చంద్రబాబు సుందర మోహాన్ని చూసిరారని తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే చంద్రబాబు ఇవాళ రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉంది. ఏ హోదా లేకపోయినా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని దేశానికే భ్రమ కల్పిస్తూ అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రంలో ఉన్న వారికి సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రంలో ఉన్నవారు ఎలా ఆడమంటే చంద్రబాబు అలా ఆడుతున్నారు. గతంలో హోదాయే సంజీవిని అన్న వ్యక్తి, ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్న వ్యక్తి.. పరిశ్రమలు పెట్టడానికే మూడు సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు హోదా ఇస్తే కుదరదు.. 15 సంవత్సరాలు కావాలని అడిగారు. వెంకయ్య నాయుడు పార్లమెంట్‌లో మైక్‌ తీసుకొని 10 సంవత్సరాలు హోదా ఇవ్వాలన్నారు. ఇవాళ వీళ్లే ఎలా ప్లేట్‌ మారుస్తున్నారంటే వాళ్ల నోట్లోనుంచి వచ్చిన మాటలను వినండంటూ... చంద్రబాబు, వెంకయ్యల వీడియోలను విద్యార్థులకు చూపించారు. 

పరిశ్రమలు రావాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది. మధ్యలోనే హోదా ఆగిపోతే ఎలా.. హోదా 15 సంవత్సరాలు కావాలన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏమొస్తుందండీ అని మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదానే సంజీవని అన్నారు. హోదా కలిగిన రాష్ట్రాలకు ఏం వస్తుంది. అలా వస్తే ఎందుకు అభివృద్ధి చెందలేదని కహానీలు చెబుతున్నారు. ఇదే చంద్రబాబు కహానీలకు ఆయనకు అర్థం అయ్యే బాషలో చెబుతాను... హోదా కలిగిన రాష్ట్రాలు దేశం మొత్తం మీద 11 ఉన్నాయి. ఈ రాష్ట్రాల జనాభా మొత్తం కలిసి కేవలం ఏడున్నర కోట్లు. 2011 జనాభా లెక్కలు చూస్తే జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం 121 కోట్ల మంది ప్రజలు దేశం మొత్తం మీద ఉంటే హోదా కలిగిన రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంతంటే కేవలం ఏడున్నర. అంటే దానర్థం ఏడున్నర కోట్ల ప్రజలకు దేశం మొత్తం మీద చూస్తే 6.5 శాతం జనాభా. 121 కోట్ల జనాభాలో 6.5 శాతం జనాభా అన్నమాట. అంటే 6.5 శాతం మంది ప్రజలకు ప్రత్యేక హోదా ఇచ్చి గ్రాండ్స్‌ ఫ్రం ది సెంటర్‌ ఎంతొచ్చాయని ఒక్కసారి చూస్తే 2012–13 బడ్జెట్‌ ఫిగర్‌ ప్రకారం.. హోదా కలిగిన రాష్ట్రాలకు రూ. 76 వేల 980 కోట్లు గ్రాంట్స్ ఫ్రం ది సెంటర్‌ ఇచ్చారు. మిగిలిన 93.5 జనాభాకు రూ. లక్షా 86,820 కోట్లు వచ్చాయి. కేవలం 6.5 శాతం జనాభాకు 30 శాతం గ్రాంట్స్‌ ఇస్తున్నారు. డెవల్యూషన్‌ ఫ్రం ది సెంటర్‌ రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఎంతిచ్చారని చూస్తే ఏపీనే చిన్న ఉదాహరణగా చెబుతారు. ఉమ్మడి ఏపీలో 8.45 కోట్ల జనాభా.. అంటే ఎనిమిదన్నర జనాభాకు 2013–14 అకౌంట్స్‌ చూస్తే రూ. 32,460 కోట్లు. అంటే ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు రూ. 32 కోట్లు ఇస్తే, ఏడున్నర కోట్ల జనాభా ఉన్న హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి మొత్తం నిధులు రూ. 91 వేల 980 కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా అని అడుగుతున్నా... ఇవన్నీ వాస్తవాలు అయినా చంద్రబాబు నోట్లో నుంచి వచ్చే మాట ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏమొస్తుందని ఒక అబద్ధం. పారిశ్రామిక రాయితీలను చూపించి హోదా 15 ఏళ్లు అడిగిన వ్యక్తి ప్లేటు మార్చి అదివేరు ఇది వేరని మాట మారుస్తున్నాడు. ఆంధ్రరాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చెనకాయలు, పప్పుబెల్లం మాదిరి పారిశ్రామిక రాయితీలు ఇచ్చింది. ఇచ్చిన పప్పుబెల్లానికి ఏ పారిశ్రామికవేత్త కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఇదే రాయితీలు చంద్రబాబు చాలా గొప్పగా ఇచ్చారని చెబుతున్నారు. ఇదే రాయితీలు పక్క రాష్ట్రాలు తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు, బీహార్‌కు ఇచ్చారు. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అని మాట్లాడుతున్నారు చంద్రబాబు.. అయ్యా చంద్రబాబు పక్కన బెంగళూరు ఉంది. ఇటు పక్క హైదరాబాద్‌ ఉంది. చెన్నై ఉంది. ఏరకంగా వారితో పోల్చగలుగుతావు హోదా లేకపోతే అని నిలదీస్తున్నాం... చంద్రబాబుకు ఇవన్నీ అడిగినా బుద్ధి రాదు. జ్ఞానం లేదు. ప్రత్యేక హోదా అనేది జగన్‌ ఒక్కడు పోరాటం చేస్తే సాధ్యం కాదు. హోదా రేపో మరనాడో వస్తుందని కూడా చెప్పలేను. హోదా అనేది మనం అడగకపోతే ప్రత్యేక హోదా అడిగేవారే ఉండరు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటను పట్టించునే వారుండరు. మనం ధర్నాలు చేస్తే.. గట్టిగా పోరాడితేనే వాళ్లు మర్చిపోకుండా ఉంటారు. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వారు సాధించుకున్నారు. పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు రాకుండా పోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం.. మూడు సంవత్సరాల పరిపాలన అయిపోయిన తరువాత జూన్‌ తరువాత జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని గట్టిగా చెబుతున్నా..పార్లమెంట్‌ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి దేశం మొత్తం చూసే విధంగా చేస్తాం.. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలని పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధాలు చెబితే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదని దేశం మొత్తం చూసేలా చేస్తారు. 
Back to Top