చంద్రబాబు నాయుడు కాదు చెప్పులనాయుడు

చెప్పులు వేయించే సంస్కృతి బాబుదే
బాబులోని రాక్షసుడు నిద్రలేచాడు
ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు
నేడు ప్రతిపక్షనాయకుడిపై చెప్పులు వేయిస్తున్నారు
ప్రజల కష్టాలను మీదృష్టికి తెస్తే ఎదురుదాడి చేస్తారా
ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు బాబుః వేణుగోపాలకృష్ణ

హైదరాబాద్ః చెప్పులు వేయించే సంస్కృతిని ఒంటబట్టించుకున్న చంద్రబాబు తన పేరును చెప్పులనాయుడుగా మార్చుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ సూచించారు. రెండేళ్లుగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు  నెరవేర్చడం చేతగాక...ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని  ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆనాడు పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించిన చంద్రబాబు..ఇవాళ టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ప్రతిపక్ష నాయకుడిపై చెప్పులు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చెప్పుల నాయుడిగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. 

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు చెప్పులతో కొడతారని వైయస్ జగన్ అంటే...అదేదో అపరాధమన్నట్లు టీడీపీ నేతలు ప్రతిపక్ష నాయకుడిపై ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. మీరిచ్చిన మోసపూరిత హామీల వల్ల  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి...వైయస్ జగన్ పై విమర్శలు చేస్తారా..? ప్రజలు పడుతున్న బాధలు చూడలేక, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు చనిపోతుంటే చలించి పోయి వారి కష్టాలను మీ దృష్టికి తీసుకొస్తుంటే ఎదురుదాడి చేస్తారా..? 

చంద్రబాబు నిజస్వరూపం  బట్టబయలైందని వేణుగోపాలకృష్ణ అన్నారు. బాబులోని  రాక్షసుడు మరోసారి నిద్రలేచాడని, ఆయన అరాచక నైజం వెలుగుచూసిందన్నారు. ఎదురు మాట్లాడినా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినా ప్రతిపక్షంపై  ఎదురుదాడి చేస్తూ బాబు తన నీచ, రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఎదుటివారిపై ఎదురుదాడి చేసి మాయమాటలతో గారడీ చేస్తున్న బాబు వైఖరిని ప్రజలు గమనించాలని వేణుగోపాలకృష్ణ సూచించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకుడిపై చెప్పులు వేయిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. 

వందలాది వాగ్ధానాలు ఇచ్చి ఆశలు రేకెత్తించి..చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రజల కష్టాలకు కారణమయ్యారు. మీరు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. మీరు చేస్తున్న ఎదురుదాడి అప్రజాస్వామికం. మీకు ఎదురుగా వచ్చిన వారిపై హింసకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నేత చెప్పిన యధార్ధాన్ని తీసుకొని పనిచేయాల్సిందిపోయి  దాడి చేస్తున్నారు. మీరు ఏం సాధించారని దీక్షలు చేస్తున్నారు బాబు...? మీ ఛానళ్లలో  ప్రచారం చేసుకోవడం కోసం తప్ప మీరు సాధించేమిటి...?  ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చంద్రబాబు తన మనస్తత్వం మార్చుకోవాలి. వైయస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలుతున్న టీడీపీ నేతలను నిరోధించాలని వేణుగోపాలకృష్ణ బాబుకు హితభోద చేశారు. 

ఇంకా ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు చంద్రబాబు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను అందరినీ మోసం చేశారు. ఆనాడు విభజనకు అంగీకరించి ఇవాళ అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.  మీరు మర్చిపోయినా ప్రజలు, ప్రతిపక్షం మీరు చేసిన మోసాలను మర్చిపోరు. తెలంగాణ ప్రాజెక్ట్ ల వల్ల రాష్ట్రం ఎడారిగా మారుతున్నా దాన్ని అడ్డుకోవడం లేదు. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడం లేదు. మీరు చేసిన నయవంచన వల్ల రాష్ట్ర ప్రజలు మనోవేధన చెందుతున్నారు. మీరు ఎన్ని చెప్పులు వేయించినా ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెబుతారని వేణుగోపాలకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top