కొత్త విదేశాంగ మంత్రి చంద్ర‌బాబు నాయుడు

దేశానికి విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిగా ఉండే నాయ‌కుడు త‌ర‌చు విదేశాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఇత‌ర దేశాల‌తో మ‌న దేశ సంబంధ బాంధ‌వ్యాల్ని ప‌రిపుష్టం చేయ‌టం ఈ శాఖ మంత్రి ప‌ని. ఆయ‌న త‌ప్పితే ఇత‌ర కేంద్ర మంత్రులు పెద్ద‌గా విదేశాల‌కు వెళ్ల‌రు. సంద‌ర్భాన్ని బ‌ట్టి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి మాత్రం వెళ్లి వ‌స్తుంటారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అయితే మొత్తం ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో 1,2 సార్లు విదేశాల‌కు వెళితే గొప్ప‌. అది కూడా ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల్ని బ‌ట్టి వెళ్లి వ‌స్తుంటారు. 
త‌న‌కు తాను హైటెడ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం చేసుకొనే చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈ విష‌యంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈ పది నెలల్లో ఐదు సార్లు విదేశాల‌కు వెళ్లి వ‌చ్చారు. అంటే స‌గ‌టున రెండు నెల‌ల‌కోసారి విదేశాల‌కు వెళ్లి వ‌స్తున్నారు. ఆయ‌న కూడా మంత్రులు, స‌ల‌హాదారులు, ఉన్న‌తాధికారులు..అబ్బో ఒక టీమ్ వెళ్లి వ‌స్తున్నారు.  ఈ సారైతే చంద్ర‌బాబుకు మంచి క‌వ‌రేజ్ ఇచ్చే ఎల్లో మీడియాకు చెందిన ప్ర‌తినిధుల్ని కూడా వెంట బెట్టుకొని వెళ్లారు. ఇంత మంది వెళుతున్నందుకు ప్ర‌త్యేక విమానాలు, ఇత‌ర సౌక‌ర్యాలు త‌ప్ప‌నిస‌రి అవుతోంది. ఇక విదేశాల్లో వ‌స‌తి సౌక‌ర్యాలు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే సొమ్ములు క‌రిగిపోతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.
తేదీలు                                  - దేశం
న‌వంబ‌ర్ 12 నుంచి 14 దాకా    - సింగ‌పూర్
న‌వంబ‌ర్ 24 నుంచి 29 దాకా    - జ‌పాన్
జ‌న‌వ‌రి  20 నుంచి 23 దాకా     - స్విట్జ‌ర్లాండ్‌
మార్చి   29 నుంచి 31 దాకా     - సింగ‌పూర్ 
ఏప్రిల్     12 నుంచి 17 దాకా     - చైనా
ఇన్ని దేశాలు చుట్టి వ‌చ్చిన చంద్ర‌బాబు టీమ్ కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే ఖ‌ర్చు పెట్టారు.  రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ చేయాలంటే డ‌బ్బులు లేవంటారు, ఆరోగ్య‌శ్రీ పేద‌ల‌కు ఆప‌రేష‌న్లు చేయించాలంటే డ‌బ్బులు లేవంటారు, క‌నీసం వృద్ధులు, వితంతువుల‌కు పెన్ష‌న్లు ఇవ్వాలంటే డ‌బ్బులు లేవంటారు, మ‌రి సొంత‌టీమ్ తో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చు పెడుతున్నారా అని సామాన్యుడు అడుగుతున్నాడు. 

తాజా వీడియోలు

Back to Top