చంద్రబాబు అండ్ కో గుండెలు గుభేల్..!

వైఎస్ జగన్ దీక్షతో వణుకు..!
పచ్చనేతల అవాకులు, చెవాకులు..!
గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. హోదా సాధించేందుకు శాంతియుత ఉద్యమంతో వైఎస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సెగ పుట్టిస్తున్నారు. గ్రామగ్రామాన దీక్ష జ్వాల రగులుతోంది. ఉద్యమం ఉధృతమవుతుండడంతో పచ్చనేతల్లో వణుకు పుడుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు,నిరుద్యోగులు, విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు సహా రాష్ట్ర ప్రజానీకమంతా వైఎస్ జగన్ కు బాసటగా కదం తొక్కుతున్నారు. వైఎస్ జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో తెలుగుతమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది.

జననేత కోసం నినదిస్తున్నయువతరం..!
వైఎస్ జగన్ దీక్షాస్థలికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ జననేతకు తోడుగా నిలుస్తున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. పోరాడే వాడే యోధుడు అంటూ వైఎస్ జగన్ పోరాట పటిమను  గుర్తుచేస్తూ యువత సోషల్ మీడియాలో జననేత కోసం నినదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా వైఎస్ జగన్ కు సంఘీభావంగా రిలేనిరాహార దీక్షలు,ధర్నాలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల శాంతియుతంగా దీక్ష చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. 

గుండెల్లో నిద్రపోతాం..!
రాష్ట్రంలోని ప్రతి గుండె హోదాను కోరుకుంటుంటే...చంద్రబాబు రాతిగుండె హోదా వద్దు అని కొట్టుకోవడం దుర్మార్గమని  ప్రతిపక్షాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. హోదా కోసం పోరాడరు, పోరాడుతున్న వైఎస్ జగన్ కు మద్దతు నిలవకుండా.... సన్నాయి నొక్కులు నొక్కడంపై మండిపడుతున్నారు. ప్రత్యేకహోదా వస్తే వైఎస్ జగన్ కు క్రెడిట్ వస్తుందనే భయపడి ...చంద్రబాబు అండ్ కో ఇష్టరీతిన మాట్లాడుతూ అవాకాలు చెవాకులు పేలుతున్నారన్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు పచ్చనేతలను తమ ప్రాంతాల్లో తిరగనీయకుండా అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో హోదా సాధించేందుకు చంద్రబాబు గుండెల్లో నిద్రపోతామని స్పష్టం చేస్తున్నారు.
Back to Top