చంద్రబాబును అధికారానికి 10 ఏళ్లుదూరం పెట్టినా ఆయనకు బుద్ధి రాలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నోటికొచ్చి మాట్లాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్లను ఉన్మాదులతో పోల్చడం బాబు అహంకారానికి నిదర్శనమన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బత్తుల చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ ను చంద్రబాబు ఉన్మాదిగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఏబీకే లాంటి గొప్ప జర్నలిస్టును ఉన్మాదిగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై కోర్టుకు వెళితే ఉన్మాదిగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు.సర్కారు దుర్మార్గపు పోకడలను నిలదీయకూడదా అని అడిగారు. ప్రభుత్వమే ప్రజలను వేధిస్తుంటే కోర్టులకు వెళ్లరా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, ఇలా నోటికి వచ్చిన వాగ్దానాలు అన్నీ ఇచ్చి ఇప్పుడు ఏ ఒక్కటీ చేయలేదని, వాటి గురించి ప్రశ్నిస్తే మాత్రం వాళ్లను ఉన్మాదులతో పోల్చడం ఎంత వరకు న్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారాడండే పట్టిసీమకు గండిపడితే అది ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేయించారని అకారణంగా అభాండాలు వేసే స్థాయికి దిగజారిపోయాడాని మండిపడ్డారు. ప్రతి దానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను ఆడిపోసుకోవడం బాబుకు అలవాటైందన్నారు. గతంలో కూడా తుని సంఘటనలో కూడా పులివెందుల వాళ్లపై నిందలు వేశారని, జగన్ మనుషులే ఆ సంఘటన చేయించారని చెప్పారన్నారు. వాళ్లు చేసి ఉంటే ఇంతవరకు ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది పొట్టన పెట్టుకున్నా చంద్రబాబుకు ప్రచారం దాహం తీరలేదన్నారు. ప్రధానమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అన్యాయాలను ఎదిరించేందుకు కోర్టును ఆశ్రయించడం తప్పా? అని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతూ తన తాబేదారులకు, కాంట్రాక్టర్లకు చంద్రబాబు లబ్ది చేకూరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. ఒక్క రాజధాని భూముల వ్యవహారంలోనే లక్షల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. ఇలా సంపాదించిన డబ్బుతోనే దేశంలో ఉన్న ధనవంతుల ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు నం.1గా నిలిచారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని అడుగుతారు కానీ ప్రత్యేక హోదాను మాత్రం అడగలేక పోతున్నారన్నారు. కావాలన్న చంద్రబాబు ప్రత్యేక హోదాను మాత్రం అడగలేక పోతున్నారన్నారు. హోదా అడగకపోగా అదేమైనా సంజీవినా అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని, ఇలాగే చేసుకుంటూ పోతే మాత్రం ప్రజలే బాబుకు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బాబు అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తూనే ఉంటామని, బాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదని బ్రహ్మానందరెడ్డి అన్నారు.