చంద్రబాబు పాదయాత్ర పదవి కోసమే: జక్కంపూడి

రాజమండ్రి:

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి నాడు చేపట్టిన పాదయాత్ర ప్రజల సమస్యల నుంచి పుట్టిందనీ, నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపడుతున్న యాత్ర ఆయన స్వప్రయోజనాలు, పదవీకాంక్షతో  ముడిపడిందనీ వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చెప్పారు. రాజమండ్రిలో కొందరు పార్టీలో చేరిన సందర్భంగా నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన సభకు విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా రూపకల్పన నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం శుభపరిణామమన్నారు.
      సభాధ్యక్షుడు బొమ్మన మాట్లాడుతూ మైనారిటీలంతా ఏకమై ఈ నెల నాలుగున కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు పార్టీలో చేరుతున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.యస్.విజయమ్మ హాజరవుతున్న సభలో మైనారిటీలు తమ సత్తా చాటాలన్నారు. పార్టీ ప్రత్యేక ఆహ్వానితుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డిపై విశ్వాసం, ఆయన అందించిన సువర్ణయుగాన్ని జగన్‌మోహన్‌రెడ్డి అందిచగలుగుతారన్న విశ్వాసంతో మైనారిటీలు పార్టీ వెంట నడుస్తున్నారన్నారు.  
     ట్రేడ్ యూనియన్ రాష్ట కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు పార్టీ ఎలాంటి కష్టాల్లోనైనా తోడుంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మేయర్ ఎం.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ మహానేత వైయస్ మాత్రమే అన్ని వర్గాల అవసరాలు దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మైనారిటీ నేత సిద్దిక్ మాట్లాడుతూ రాజమండ్రిలోనే కాదు రాష్ట్రంలోనే 75 శాతం మందికిగా మైనారిటీలు వైయస్ఆర్ సీపీ వెంట నడుస్తున్నారన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు లంకా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు కొండంత ఆశతో ప్రభుత్వానికి అందచేస్తున్న అర్జీలను చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి మాత్రం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారన్నారు. అనంతరం మైనారిటీ నాయకుడు అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

Back to Top