చంద్రబాబు చేసింది శూన్యం: జనార్దన్


బెల్లంపల్లి
: ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ విమర్శించారు. బెల్లంపల్లి నం.2 ఇంక్లైన్‌బస్తీలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లు రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన చేసిన చంద్రబాబు ప్రజల దృష్టిలో దెయ్యంగా మారారన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. ఎన్నో ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని తెలిపారు. మీకోసం అంటూ ఎన్నియాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ, కాంగ్రెస్‌లు ఏమీ చేయలేవన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.

పార్టీలో చేరిక: బెల్లంపల్లి మున్సిపాలిటీ 9, 11, 12, 13వ వార్డుల నుంచి సుమారు 150 మంది యువకులు పార్టీ జిల్లా కన్వీనర్ జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరారు. 9వ వార్డు నుంచి శ్రీకాంత్, శివకుమార్, రాకేశ్, సతీశ్, హరీశ్, రవికుమార్, ప్రవీణ్, భరత్, 11వ వార్డు నుంచి ఎస్కే గౌస్‌బాబా, ఎండీ ఖాజా, ఎండీ ఆలీబాబా, భాస్కర్, రమేశ్, అన్వేష్, చందు, అజయ్, 12వ వార్డు నుంచి ఎండీ సలీం, బి.వినోద్, శ్రీనాథ్, అవినాష్, నరేశ్, ఇమ్రాన్, 13వ వార్డు నుంచి వెంకటేశ్, రాజేందర్, ప్రభాకర్, శంకర్, చంద్రయ్య, నరేశ్, ప్రకాశ్ వారి అనుచరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం.బాలకృష్ణ, టి.రమేశ్‌సింగ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎండీ అఫ్జల్, పట్టణ అద్యక్షుడు మేకల వెంకటేశ్, ఉపాధ్యక్షుడు సుద్దాల నర్సయ్య, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రాధాకృష్ణ, బెల్లంపల్లి మండల కన్వీనర్ సింగతి కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, అర్సం మురళీపుత్ర, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు కె.మధుకర్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు అంకం రవి, బొద్దున తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top