'బ్రహ్మణి'ని సందర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

జమ్మలమడుగు, 24 మే 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, తదితరులు గురువారం  బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను సందర్శించారు. వారిలో ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మునయ్య, బ్రహ్మానందరెడ్డి, అప్జల్‌ఖాన్‌ తదితరులున్నారు. ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను తీసుకుని నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ నేతల పర్యటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు.

Back to Top