వైయ‌స్ఆర్ కు పేరొస్తుందని బాబుకు భ‌యం

  • బాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణాడెల్టాలో కరువు
  • ఏనాడు రైతులు ఇంతగా బాధపడలేదు
  • కృష్ణా జిల్లా బాపుల‌పాడులో మినుము పంట ప‌రిశీల‌న‌
  • రైతులతో వైయస్ జగన్  ముఖాముఖి..టీడీపీ సర్కార్ పై ధ్వజం
విజయవాడ:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి పేరొస్తుంద‌ని, ఆయ‌న పేరు కాట‌న్‌దొర‌లా చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మ‌హానేత పులిచింత‌ల ప్రాజెక్టును పూర్తిగా నిర్మిస్తే..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.120 కోట్లు చంద్ర‌బాబు స‌ర్కార్ చెల్లించ‌క‌పోవ‌డంతో కృష్ణా డెల్టాలో కరువు ఏర్పడిందని, ఏలూరు కాల్వ పుట్టిననాటి నుంచి ఏనాడూ ఇలాంటి రైతులు ఇంతలా బాధపడలేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడులో సోమవారం పర్యటించిన వైఎస్‌ జగన్‌ ఎండిపోయిన మినుము పంటలు పరిశీలించి, స్థానిక మినుము రైతులతో ముఖాముఖి మాట్లాడారు. 
--------------------
బాపులపాడులో రైతుల‌తో వైయస్‌ జగన్‌ ముఖాముఖి

రైతు ఉమామహేశ్వరరావు:
పట్టిసీమ పట్టుసీమ అని బాబు చెబుతారు..ఈ నీళ్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియడం లేదు. మాకు మాత్రం బీడు భూములు కనిపిస్తున్నాయి. ఎకరానికి ఐదువందలకు డెల్టా భూములు గొర్రెలు మేపుకునేందుకు ఇస్తున్నాం. మాకు ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇవ్వ‌డం లేదు. ఇన్సూరెన్స్  అంద‌డం లేదు.

వైయస్‌ జగన్‌: 
పులిచింతలలో 45 టీఎంసీలు స్టోర్‌ చేసుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టు. ఇవాళ ఈ ప్రాజెక్టులో 22 టీఎంసీలు మాత్రమే స్టోర్‌ చేస్తున్నారు. ఇదే చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం లేఖల మీద లేఖలు రాస్తోంది. మాకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వండి, ఇంకా పెండింగ్‌లో ఉన్న రూ.120 కోట్లు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోరుతున్నా..చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వారికి పరిహారం చెల్లిస్తే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. నిరుడు కూడా దాదాపు 27 టీఎంసీలకు మించి స్టోర్‌ చేయలేదు. పులిచింతలలో నీరు ఉంటే..ప్రకాశం బ్యారేజీకి నీరు వెళ్తుంది. అక్కడి నుంచి ఈ ప్రాంతానికి నీరు వస్తుంది. అటువంటింది చంద్రబాబు చేయవల్సిన పనులు చేయకపోవడంతో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. రైతు ఉమామహేశ్వరరావు మినుము పంటను చూపించి పట్టిసీమ నీళ్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నాడు. ఒకవైపు పట్టిసీమ నుంచి 40 టీఎంసీల నీరు తెచ్చామంటారు. మరో వైపు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 55 టీఎంసీల నీటిని దిగువకు వదిలి సముద్రంలో కలుపుతున్నారు. ఇదే చంద్రబాబు ఏం తెచ్చాడు. తెచ్చిన నీళ్లు ఆ సముద్రంలో కలుపుతున్నాడా? లేకపోతే రైతులకు ఇచ్చారా? అన్నదానికి ఈ ఎండిపోయిన మినుము పంటే సాక్ష్యం. గత రెండేళ్లుగా రైతులు వరి వేసుకోలేక, మినుము పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం మూడు సార్లు మినుము వేస్తే వైరస్‌ వచ్చిన పరిస్థితి. మాములుగా ఈ వైరస్‌ అన్నది మెట్ట ప్రాంతంలో సాగు చేసిన మినుము మాత్రమే సోకుతుంది. అలాంటిది డెల్టా ప్రాంతంలో కూడా రావడం గతంలో ఏనాడు లేదు. డెల్టాలో నీళ్లు లేని పరిస్థితుల్లో ఇక్కడ సాగుచేసిన పంటలకు కూడా వైరస్‌ సోకుతోంది. పంటలు ఎండిపోతున్నా..పట్టించుకునే నాథుడు లేడు. సర్వేలు లేవు..ఇన్‌ఫుట్‌ సబ్సిడీ లేదు. ఇన్సూరెన్స్‌ కూడా వంద మంది రైతుల్లో ఒకరిద్దరికి మాత్రమే చెల్లించారు. టీడీపీకి నచ్చిన వారికే రాసుకున్నారు. ఇద్దరికో ముగ్గురికో ఇన్సూరెన్స్‌ రాసుకునే పరిస్థితి నెలకొంది. బాబు సీఎం అయ్యాక నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతే ఆదుకోవడం లేదు. ఎప్పుడు నీళ్లు వచ్చే డెల్టా ప్రాంతంలో ఇప్పుడు కరువు ఏర్పడింది. నీళ్లు వస్తాయన్న ఆశతో మినుము వేసుకుంటే ఆ పైరు కూడా చచ్చిపోయింది. మూడు సార్లు సాగు చేసేలోగా మినుము సాగుకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేల వరకు ఖర్చు వచ్చింది. నిజంగా ఇంతదారుణంగా దయనీయంగా పరిస్థితి ఉంది. ఇదే కృష్ణా జిల్లాలోని గన్నవరం నుంచి చంద్రబాబు విమానం ఎక్కుతారు. ఈ గన్నవరంలో పరిస్థితులు ఎలాగున్నాయే పరిస్థితి బాబుకు అర్థం కావడం లేదు. ఇదే జిల్లాకు చెందిన ఇరిగేషన్‌ మంత్రి ఉన్నారు. వీరంతా కూడా రోజు గన్నవరం నుంచి విమానాలు ఎక్కుతున్నారు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తెలిసి కూడా కన్నెత్తి చూడటం లేదు. డెల్టాలో మొట్టమొదట వచ్చేది కానుమూరు గ్రామమే. ఇక్కడ 3 వేల ఎకరాల పొలం ఉంటుంది. అయితే కనీసం 300 ఎకరాల్లో కూడా పంటలు సాగు చేయలేదు. రైతు కూలీలకు పనులు లేవు.
–––––––––––––––
రైతు కూలీ
నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. నీళ్లు రాకపోతే రైతులు ఏమై పోవాలి. ఆశ చావక మినుము పంట వేసుకుంటే ఇప్పుడు నీళ్లు లేక పైరు చనిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమై పోతారు. కూలీలు ఎలా బతకాలి.
వైయస్‌ జగన్‌: రెండేళ్ల వరకు ఏలూరు కాల్వకు పుష్కలంగా నీరు వచ్చేది. తెలంగాణ ప్రభుత్వానికి రూ.120 కోట్లు పరిహారం చెల్లించి ఉంటే..పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది.
––––––––––––––––––
బాబుకు బుద్ధి చెప్పాలి
కొడాలి నాని, ఎమ్మెల్యే
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందన్న కారణంతో ఈ రోజు పులిచింతలలో నీరు నిల్వ చేయడం లేదు. కాటన్‌దొరలాగా చిరస్థాయిగా ఈ ప్రాంతంలో మహానేత పేరు నిలిచిపోతుందని బాబు నీరు ఇవ్వడం లేదు. తెలంగాణకు రూ.120 కోట్లు కట్టకుండా ఈ ప్రాంతంలో ఉన్న బీద, బిక్కిలను చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి.
––––––––––––
వైయస్‌ జగన్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పూర్తిగా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. కేవలం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రైతులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లిస్తే చాలు..ఆ ప్రాజెక్టు నిండా నీరు నిల్వ చేసుకోవచ్చు. చంద్రబాబు తీరుతో రైతులు రెండేళ్లుగా తమ భూములను బీడులుగా పెట్టుకుంటున్నారు. ఈ చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా?అని అడుగుతున్నాను. పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నిలబడితే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కాటన్‌ దొరలా చిరస్థాయిగా నిలిచిపోతారని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్న చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గట్టిగా నిలదీద్దాం. నేను ఇక్కడికి వచ్చిపోయిన తరువాతైనా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం కాస్తోకూస్తో పెరుగుతోంది.
Back to Top