హోదాకు అడ్డంకి చంద్ర‌బాబే..!


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుప‌డుతున్న‌ది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.  ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ఢిల్లీకి వెళ్లి పోరాడాలని అధికార పార్టీ నేతలు అనడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గతంలోనే పార్లమెంట్ను ముట్టడించిన విషయాన్ని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి సిద్ధమో కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరాటంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆదివారం విజయవాడలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి మాట్లాడుతూ.. రాష్ట్రం తీవ్రసమస్యల్లో ఉంటే చంద్రబాబు విదేశాలకు ఎలా వెళ్తున్నారని  ప్రశ్నించారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కేద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయడంలేదని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, ప్రతాప్ అప్పారావు, పార్థసారధి, వంగవీటి రాధా, పేర్ని నాని, ఉదయ భాను, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
To read this article in English:  http://bit.ly/1VQ1wU0 

Back to Top