ఊహల్లో ఉండే మాయలోడు చంద్రబాబు

హైదరాబాద్) ఎప్పుడూ ఊహల్లో బతుకుతూ మాయ మాటలు చెప్పే మాయలోడుగా ముఖ్యమంత్రి
చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే
భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో రక రకాల నగరాల పేర్లు చెప్పి
పబ్బం గడుపుకొంటున్నారని ఆయన అన్నారు.  ఈ
ధోరణి సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్ని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ఆలోచనల్ని తాము
వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పేదవాడి ఆరోగ్యాన్ని విస్మరించేందుకు
తాపత్రయ పడుతోందని అన్నారు. ఇప్పటికే విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించారని ఆయన
గుర్తు చేశారు. 

Back to Top