అమ్మో చంద్ర‌బాబు.. నెంబ‌ర్ వ‌నా..!

హైద‌రాబాద్‌)) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. అదేదో ప్ర‌గ‌తిలోనో, పాల‌నలోనో అనుకొంటే పొర‌పాటే. దేశంలో కోటీశ్వరులైన ముఖ్యమంత్రుల్లో నారా చంద్రబాబునాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఎన్నికల సంస్కరణలు, ప్ర‌గ‌తి వంటి అంశాల్ని అధ్యయనం చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ఒక జాతీయ స్థాయి నివేదిక‌ రూపొందించాయి. ఆ నివేదిక ప్రకారం చంద్రబాబు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులతో పోల్చితే.. నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న 20 మంత్రుల్లో 18 మంది కోటీశ్వరులే. 

వివిధ లావాదేవీల్లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబుకి పేరు ఉంది. అధికారంలోకి వ‌చ్చాక ప‌ట్టిసీమ‌, లిక్క‌ర్ మాఫియా, ఇసుక మాఫియాతో విప‌రీతంగా సంపాదించేశారు. రాజ‌ధాని భూ దందాను అంత‌ర్జాతీయ కుంభ‌కోణంగా అభివ‌ర్ణిస్తారు. ఇన్ని ర‌కాలుగా సంపాదిస్తున్నందుకే నెంబ‌ర్ వ‌న్ కోటీశ్వ‌రుడు అయ్యారు. 
Back to Top