నాన్న నేర్పిన విలువ‌లే నాకు స్ఫూర్తి

ఫాదర్స్ డే సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌ను స్మరించుకున్న వైయ‌స్‌ జగన్‌

 తాడేపల్లి:  ఫాదర్స్ డే సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత వైయ‌స్ఆర్‌ను స్మరించుకుంటూ వైయ‌స్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో తాను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయ‌స్ఆర్‌ అని కొనియాడారు.
 
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ ట్విట్టర్‌ వేదికగా..
‘నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయ‌స్ఆర్‌ గారు. ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 

Back to Top