‘సుగాలీ ప్రీతి కేసులో పవన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే’

మాజీ మంత్రి ఆర్కే రోజా
 

తిరుపతి: సుగాలీ ప్రీతి కేసులో పవన్‌ కళ్యాణ్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీనే అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని పవన్‌ అన్నాడు. రెండేళ్లయింది.. పవన్‌ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్‌ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్‌ బఫూన్‌లా మారారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌, అనిత శనిలా పట్టుకున్నారని రోజా విమర్శించారు. 
 

Back to Top