ప్రాజెక్ట్ లపై చర్చకు సిద్ధమా బాబు..?

హైదరాబాద్‌ : ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై  చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సర్కార్‌కు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ విసిరింది. చంద్రబాబు హయాంలో ఎన్ని  ప్రాజెక్టులు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆ పార్టీ  ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను కట్టానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

పార్టీ కేంద్రకార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనా కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.  పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభం నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని గృహ నిర్భంధం చేయడాన్ని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Back to Top