ఏపీ మీ అయ్య జాగీరా..?

()ఏపీని చంద్రబాబు అనాథ రాష్ట్రంగా మార్చాడు
()సొంత సోకులే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు
()ఏపీని దేశం ముందు చేతగాని రాష్ట్రంలాగా నిలబెట్టాడు
()బాబు స్థానంలో సామాన్యుడున్నా ఏపీకి న్యాయం జరిగేది
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ 

హైదరాబాద్ః రాష్ట్ర్లంలో చేతగాని దద్దమ్మ పాలన సాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఎంతసేపు జాతరలు, లేజర్ షోలు, ప్రత్యేకవిమానాలు, కోట్లాది రూపాయలు దుబారా చేయడం తప్ప...చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణా, గోదావరి జలాలను తోడుకుపోతుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు బదులు ఓ సామాన్యుడు ఆ కుర్చీలో ఉన్నా రాష్ట్రానికి ఈదుర్గతి పట్టేది కాదని పద్మ అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే...
()తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలపై అడ్డగోలుగా ప్రాజెక్ట్ లు కట్టుకుంటూ పోతుంటే...యాప్ లు, టెక్నాలజీలంటూ చంద్రబాబు చిదానందస్వామి లాగ వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. 
()కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఎందుకు ప్రశ్నించడం లేదు. కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు.
()కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఇంతవరకు నీటి కేటాయింపులపై నిర్ణయం జరగలేదు. 
()నిర్ణయం జరగని నీటి కేటాయింపుల్లో  900 టీఎంసీలు వస్తాయని కేసీఆర్ ఎలా మాట్లాడుతారు.  టీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రభుత్వంతో నీటి ఒప్పందాలు , ప్రాజెక్ట్ ల  రీడిజైన్ లు చేసుకుంటుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు
()అసలు కృష్ణా, గోదావరి నదులపై ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే అపెక్స్ కమిటీ, కేంద్రజలసంఘం, నిర్వాహణ బోర్డు అనుమతి తీసుకోవాలి. కేసీఆర్ ఏ అనుమతి తీసుకున్నారు.
()గోదావరిపై 900 టీఎంసీలు వాటా ఉందని  కేసీఆర్ ప్రాజెక్ట్ లు కట్టుకుంటుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ ఎందుకున్నట్టు. రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ లు పూర్తయితే ఏపీకి చుక్క నీరు రాదు. ఎడారిగా మారుతుంది. ఇంత ప్రమాదకర పరిస్థితిలుంటే..కేంద్రంలో భాగస్వామిగా ఉండి, ఇద్దరు మంత్రులుండి తెలంగాణ వైఖరిపై చంద్రబాబు కేంద్రం వద్ద మాట్లాడకపోవడం దారుణం.  
()ప్రత్యేకహోదా చట్టంలో లేదు కాబట్టి హోదా ఇవ్వమనడం సరికాదు . చట్టంలో పొందుపర్చిన పోలవరానికి సంబంధించి.. నిర్వాహణ బాధ్యత  మొత్తం కేంద్రందే అయినప్పుడు ఎందుకు పూర్తి చేయరు అని బాబు ఎందుకు అడగడం లేదు.
()టెక్నాలజీని అడ్డుపెట్టుకొని బాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. పాలనతో మెప్పించలేకపోయారు. ఆయన సర్వేలోనే బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా నిర్ణయాలు వస్తున్నాయి. 
()ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రంతో  రాజీపడ్డారు. 13 రాష్ట్రాలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని అడుగుతుంటే బాబు దద్దమ్మలాగా కూర్చున్నాడు
() కృష్ణా, గోదావరి జలాల విషయంలో బాబు అలుసు చూసుకొని తెలంగాణ దూకుడుగా పోతోంది. కర్నాటక ప్రభుత్వం కూడా తుంగభద్రపై జలాశయం కడతామంటున్నారు. ఏపీకి చుక్కనీరు రాకుండా దిగ్బందనం చేస్తున్న పరిస్థితులు కనబడుతుంటే... నీరో చక్రవర్తిలాగా బాబు ఫిడేల్ వాయిస్తున్నాడు. 
()బాబును రాష్ట్రం తరపున ఎందుకు క్షమించాలి. టీడీపీ వల్ల ఏపీ అనాథలాగా మారింది. చంద్రబాబు ఏపీని చేతగాని రాష్ట్రంలాగా దేశముందు నిలబెట్టారు. 
()మీరు ముఖ్యమంత్రి కాదా బాబు..? ఏపీ నష్టపోతుంటే ఎందుకు మాట్లాడరు. కృష్ణా, గోదావరి జలాలు కేసీఆర్, ఫడ్నవీస్ ల సొంత వ్యవహారం కాదని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు.  మీ తెలివి, సీనియారిటీ, టెక్నాలజీ ఏమైంది. సామాన్యునికి పట్టెడు అన్నం పెట్టలేని చేతగాని ప్రభుత్వం. బాబు స్థానంలో సామాన్యుడు కూర్చున్నా ఏపీకి న్యాయం జరిగేది. 
()ఓటుకు నోటుకు కేసులో కేసీఆర్ కు సాగిలబడి పోయి ఏపీకి అన్యాయం చేస్తున్నావ్.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల తరపున నిలబడండి. 
()ఏపీలో ఏం జరుగుతున్నా ప్రతిపక్షం మాట్లాడవల్సి వస్తోంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో నీటి యుద్ధాలు జరుగుతాయని  వైయస్ జగన్ ముందే హెచ్చరించారు.  రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కర్నూలులో దీక్ష చేశారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర జలశాఖ మంత్రికి లేఖలు కూడా రాశారు. 
()ఎంతసేపు ప్రతిపక్షం పోరాడుతుందే తప్ప....ముఖ్యమంత్రి లేఖ రాయడు. కేంద్రాన్ని అడగడు. ఎంతసేపటికి బాబుకు జాతరలు, లేజర్ షోలు, ప్రత్యేకవిమానాలు, ఆహ్వానాలు, కోట్ల రూపాయల దుబారాలు కావాలి. మీ సొంత ప్రచారానికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. మరి రాష్ట్ర హక్కుల కోసం సుప్రీంకోర్టు, ప్రధాని తలుపు ఎందుకు కొట్టరు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులను ఎందుకు ప్రశ్నించరు. 
()చంద్రబాబు ఏపీ మీ జాగీరు కాదు. కేనలం మీరు 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారంతే. ప్రజలు రాష్ట్రాన్ని మీకు రాసివ్వలేదు. ఒక్క అన్యాయం కాదు మీరు చేస్తుంది. ప్రత్యేకహోదా సంజీవనా, రాకపోయిన పర్వాలేదని ముఖ్యమంత్రి, మంత్రులు, లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. 
()హోదా,  నీళ్లు తీసుకురాలేనప్పుడు ముఖ్యమంత్రిగా బాబు ఉండి ఏం లాభం. తెలుగు ఆత్మగౌరవం ఏమైంది. హోదా సాధించుకోలేని దద్దమ్మలు ఏపీ ప్రజలు అని మిగతా పార్టీలు వేలెత్తి చూపుతుంటే పౌరుషం లేదా..? 
()తెలంగాణ కడుతున్న ప్రాజెక్ట్ లను కూడా అడగలేకపోతున్నావంటే ప్రజలు నిన్ను క్షమించరు. మీడియా ముందు గంటల కొద్దీ కూర్చుంటే నీళ్లు వస్తాయా...? టెక్నాలజీ గురించి మాట్లాడితే పోలవరం పూర్తవుతుందా...? పనికొచ్చే పని ఒక్కటి చేయడం లేదు. 
()అన్నీ అబద్ధపు మాటలు, మోసపోరిత విధానాలే. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఏపీకి ఈదుర్గతి పట్టడం బాధాకరం.  అడిగే వాడు లేడు. ఇచ్చేవాడు అంతకన్నా లేడు. ఏపీకి ఎందుకీ కర్మ. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నీటి జలాలు రాకపోతే ఏపీకి భవిష్యత్తే లేదు. 

తాజా వీడియోలు

Back to Top