అంగన్ వాడీల ఆందోళనలు

ఏపీలో అంగన్ వాడీ కేంద్రాల బంద్ కొనసాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు భగ్గుమంటున్నారు. పెంచిన వేతనాలు అమలు చేయడంతో పాటు తక్షణమే జీవో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.  తక్షణమే తమ న్యాయపరమైన సమస్యలు నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. దీనికి తోడు గత కొద్ది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్యకర్తల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గత కొన్నాళ్లుగా అంగన్ వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఐనా, వారి సమస్యలు నెరవేర్చకుండా పచ్చసర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది .పెంచిన వేతనాల అమలు కోసం హామీ కాదు జీవో ఇవ్వాలి అనే నినాదంతో అంగన్ వాడీ కేంద్రాల బంద్ చేపట్టారు. 
Back to Top