వైఎస్ జగన్ దృష్టికి ‘అనంత’ రైతు సమస్యలు

అనంతపురం: ఖరీఫ్, రబీ పంటలు దెబ్బతినడం, రుణమాఫీ, పంట రుణాలు లేక అనంతపురం జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రైతు విభాగానికి చెందిన పలువురు నేతలతో కలసి వైఎస్ జగన్‌ను కలసినట్లు ఆయన చెప్పారు. ఈమేర కు అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పంట, బంగారు రుణాలు రుణమాఫీకి రూ.4.944 కోట్లు అర్హత ఉన్నా కేవలం రూ.780 కోట్లు మాఫీ కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పామన్నారు. ప్రజా సమస్యల పట్ల మరీ ముఖ్యంగా రైతులు, మహిళా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందించి వారి వెంట నిలవాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు కేశవరెడ్డి వివరించారు.
Back to Top