అలుపెరుగని బాటసారులు

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  రెక్కల కష్టంతో అధికారం అనుభవిస్తున్న వారు ప్రతిపక్షాలతో కుమ్మక్కై ఆ మహానేత నేత కుటుంబాన్ని అష్టకష్టాలు పెడుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. పాలకుల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరిస్తూ.. వారి కష్టాలు తెలుసుకునేందుకు రాజన్న తనయ శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆమెకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సొంతబిడ్డలా అక్కున చేర్చుకుని ఆశీర్వదిస్తున్నారు. ఎందరో ఇడుపులపాయ నుంచి ఆమె వెంట నడుస్తూ పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా షర్మిలకు అండగా ఉంటామని స్పష్టంచేస్తున్నారు. శ్రీమతి షర్మిల వెంట రెండువేల కిలో మీటర్లు పాదయాత్ర పూర్తిచేసిన కొందరు తమ అభిప్రాయలను తెలిపారు.

సంతోషంగా ఉంది: జొన్నల శ్రీనివాసరెడ్డి, దేవరపల్లి, కృష్ణా జిల్లా
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  కుటుంబం అంటే నాకు అంతులేని అభిమానం. నాడు డాక్టర్ వైయస్ఆర్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పా ల్గొన్నాను. ఆయన తనయుడు  శ్రీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రలో కూడా కడవరకు పాల్గొన్నా. ఇడుపులపాయ నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొంటు న్నా. రెండు వేల కిలో మీటర్లు పూర్తయినందుకు సంతోషంగా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి  సీఎం అయ్యే వరకు ఆ కుటుంబం చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా పాల్గొంటాను.

జగన్ సీఎం కావాలి:అందూరి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా
కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్ కుటుంబం చల్లగా ఉండాలి. అప్పటివరకు వైఎస్సార్ కుటుంబానికి నా వంతు సాయంగా ప్రతి కార్యక్రమం లో పాల్గొంటాను. వారి వెంట నడుస్తా. ప్రజలకు మేలు చేసే పనుల్లో ముందుం టాను. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుంది.

రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం:ఆవుల భాస్కరరెడ్డి, కనిగిరి, ప్రకాశం జిల్లా
ఒక మహిళ 2వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న షర్మిలకు చేదోడువాదోడుగా ఆమె వెంట నడుస్తున్నాను. 2వేల కిలోమీటర్లు నడిచినట్లే లేదు. ఇచ్చాపురం వరకు యాత్రలో పాల్గొంటాను.

అలుపే లేదు: ఇమామ్‌బాష, పులివెందుల
ఇడుపులపాయ నుంచి బయలుదేరి తొమ్మిది జిల్లాలు దాటుకుని రెండువేల కిలో మీటర్ల మైలురాయిని పూర్తిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతదూరం ప్రయాణం చేసినా అలుపన్నదే లేదు. అడుగడుగునా ప్రజలు వైఎస్సార్ కుటుంబంపై చూపిస్తున్న అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకే ఉత్సాహంగా ముందుకు సాగున్నాను.

ఊతకర్ర సాయంతో..:అనుపట్టి వెంకటయ్య, మాజీ సర్పంచ్, చందాపూర్, మహబాబూనగర్ జిల్లా
పుట్టుకతోనే వికలాంగుడిని అయిన నేను వైఎస్ పుణ్యమా అని సర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఐదేళ్లపాటు ప్రజలకు సేవచేశా. వైఎస్‌పై ఉన్న అభిమానంతోనే ఇడుపులపాయ నుంచి షర్మిల వెంట నడుస్తున్నాను. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన వెంట కొద్ది దూరం నడిచా. ఇప్పుడు మాత్రం ఇచ్చాపురం వరకు షర్మిల వెంటే ఉంటాను. వైఎస్ కుటుంబం కోసం ఊతకర్ర సాయంతో ఎంతదూరమైనా నడుస్తా. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా.

Back to Top