బాబు కొడుకులు జేబు నుంచి కట్టాలి

  • ప్రజలఆస్తిని వడ్డీరూపంలో కాజేసేందుకు కూడ వెనుకాడడం లేదు
  • సదావర్తి భూములను బాబు అప్పనంగా కాజేయాలని చూశాడు
  • చెల్లించిన సొమ్మును వడ్డీరూపంలో తిరిగివ్వాలని అడగడం సిగ్గుచేటు
  • సదావర్తి భూములు ఏపీవని స్పష్టమైన ఆధారాలున్నాయి
  •  ఆర్కేను తీసుకొమ్మన్నట్టు ..ఆ భూములను తమిళనాడుకు ఇవ్వొద్దు
  • ఏపీ భూములని కోర్టులో వాదనలు వినిపించాలి
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రజల ఆస్తిని చివరకు వడ్డీ రూపంలో కూడ కాజేయాలని చూస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. తాము చెల్లించిన సొమ్మును వడ్డీ రూపంలో తిరిగి ఇవ్వాలని బాబు మనుషులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటన్నారు. సదావర్తి భూములు ఎవరివో తేల్చాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించిందన్నారు. అదేవిధంగా బాబు బినామీలు గతంలో వందలకోట్ల విలువ చేసే పేద బ్రాహ్మణులకు చెందాల్సిన భూముల్ని కారుచౌకగా ఏవిధంగా కొట్టేయాలని చూశారో, వాటిని  వారు వడ్డీరూపంలో డబ్బులు అడిగితే ఈ అంశాన్ని కూడ పరిశీలించాలని  సుప్రీం హైకోర్టుకు సూచించిందని ఆర్కే పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు. 

వేద విద్యనభ్యసించే పేద బ్రాహ్మణుల కోసం , దూపదీప నైవేద్యాలు లేకుండా అల్లాడుతున్న దేవాలయాలను ఆదుకోవడం కోసం రాజా వాసిరెడ్డి వారసులు 472 ఎకరాల ఆస్తిని దానం చేస్తే....ఆ ఆస్తిని మూడోకంటికి తెలియకుండా బాబు అన్యాయంగా, అక్రమంగా కాజేయాలని చూశారని ఆర్కే ధ్వజమెత్తారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును, జీవోలను దాచిపెట్టి మరీ ఆక్షన్ ను పూర్తిగా పాటించకుండా కారుచౌకగా తన బినామీలకు భూములు కట్టబెట్టాలని చూశారని ఫైర్  అయ్యారు. నిజాయితీపరురాలైన భ్రమరాంబ అనే అధికారిణి రాసిన వాస్తవాలను కూడ పక్కనబెట్టారన్నారు. ప్రజల, దేవాదయ ఆస్తులను కొట్టేయకూడదన్న ఇంగితజ్ఞానం కూడ లేకుండా బాబు తన మనుషులకు 22కోట్లకు అన్యాయంగా భూములు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అక్రమాలను వైయస్సార్సీపీ ప్రజాక్షేత్రంలో, హైకోర్టుకు పిల్ రూపంలో తీసుకెళ్లి పోరాటం చేసిందని ఆర్కే గుర్తు చేశారు.  ఎక్కడ వైయస్సార్సీపీ బాబు చేసిన లూటీని బయటపెడుతుందోనని ఐదుకోట్లు మీరే ఎక్కువ ఇచ్చి తీసుకోవచ్చంటూ  నిస్సిగ్గుగా అఫిడవిట్ లో ఇరికించారన్నారు. తన చేత రూ.  27కోట్లు కట్టించినప్పటికీ తిరిగి ఇవ్వమని తాము అడగలేదన్నారు. పేద బ్రాహ్మణుల కోసం రాజావాసిరెడ్డి దానం చేసిన భూములను ప్రభుత్వ దోపిడీ నుంచి కాపాడాలన్నదే తమ తపని అని అన్నారు. ఐటీ దాడులు చేయిస్తామంటూ మంత్రి లోకేష్ తమను ఎలా బెదిరించారో ప్రజలంతా చూశారన్నారు.  

బాబు హైకోర్టు తీర్పుకు లోబడి ఉండకుండా సుప్రీంకు వెళ్లినా ఒప్పుకోకుండా మళ్లీ ఆక్షన్ పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందన్నారు. 22 కోట్ల నుంచి 60.30 కోట్లకు వేలం జరిగిందని, దాన్ని కూడ బాబు తన బినామీలతో ఎలా పొందాడో చూశామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడకుండా బాబు సుప్రీంకోర్టుకు వెళ్లాడంటేనే సదావర్తి భూములను కొట్టేయాలని ప్లాన్ వేశాడని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బాబు ప్రజల ఆస్తిని వడ్డీరూపంలో కూడ కాజేసేందుకు వెనుకాడడం లేదని ఆర్కే నిప్పులు చెరిగారు.  నీవు, నీ కొడుకు సొంత జేబుల్లోంచి వడ్డీ కట్టాలి తప్ప ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ధనాన్ని కాదని సూచించారు. రాజావాసిరెడ్డి వారసులు పేద బ్రాహ్మణులకు దానం చేసిన  472 ఎకరాలు సదావర్తి భూములేనని చెన్నై పట్టు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని , ఆర్డీవో కూడ పేపర్లో పొందుపర్చారని, రైతులు కౌలు కట్టిన సాక్ష్యాధారాలున్నాయని ఆర్కే చెప్పారు.  ఆ ఆస్తులన్నీ ఏపీ దేవాదయ శాఖ ఆస్తులని మన ఎండోమెంట్ శాఖ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు.  వీటిని కోర్టుకు సమర్పించి,  ఆ భూములన్నీ ఏపీకి చెందుతాయని వాదనలు వినిపించాలన్నారు. అంతే గానీ,  ఐదుకోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకొమ్మని ఆర్కేకు చెప్పినట్టు....ఐదో, పదో ఎక్కువిచ్చి తీసుకోవాలని తమిళనాడుకు సలహాలు, సూచనలు ఇవ్వవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. బాబు, లోకేష్ లు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. దేవాదయ శాఖా మంత్రి మాణిక్యాలరావు ముందుకు వచ్చి  ఫైట్ చేయాలని సూచించారు.
Back to Top