సదావర్తి భూములు ఎవరివో తేల్చాలని సుప్రీం ఆదేశం

హైదరాబాద్‌: సదావర్తి భూములు ఎవరివో తేల్చాలని గౌరవ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బినామీలు ఎవరైతే వందల కోట్లు విలువైన భూములను కారుచౌకగా కొట్టేయాలని చూశారో వాళ్లు తిరిగి సుప్పీం కోర్టును ఆశ్రయించారని, తమ డబ్బును వడ్డీరూపంలో చెల్లించాలని కోర్టును కోరారన్నారు. దాన్ని కూడా మీరే పరిశీలించాలని సుప్రీం హైకోర్టుకు తీర్పు పంపించిందన్నారు. 

Back to Top