ఆనం వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు

హైదరాబాద్, 13 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు చేశారు. మంత్రి ఆనం దిష్టిబొమ్మలను ఉరి తీశారు. తగులబెట్టారు. మంత్రిని మానసిక రోగుల ఆస్పత్రిలో చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నేత రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్‌లో శీలం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాణీగంజ్ పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

కరీంనగర్లో మంత్రి ఆనంపై డిఎస్పి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తాడికొండ అడ్డరోడ్డు, దాచేపల్లి, ముప్పాళ్ల, మేడికొండూరులలో ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నకిరెకల్లలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  కృష్ణమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఇయ్యంబంజర్‌లో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, వికోట, పలమనేరులలో మంత్రి ఆనం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే బాబ్జి ఆధ్వర్యంలో ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయరహదారిపైన, ముమ్మిడివరంలలో పార్టీ  కార్యకర్తలు ధర్నా చేశారు.

Back to Top