80 అడుగుల సమైక్య శంఖారావం వేదిక

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించడానికి వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ ప్రారంభమైంది. పార్టీ ముఖ్య నేతలు ఆసీనులు కావడానికి స్టేడియంలో 80 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై పదహారు అడుగుల ఎత్తై  ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పటం, తెలుగుతల్లి విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి ‌డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు.

సమైక్య శంఖారావం సభను స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరి నుంచి తిలకించడానికి వీలుగా ప్రాంగణంలో నాలుగు అతి పెద్ద ఎల్‌సీడీలు ఏర్పాటు చేశారు. స్టేడియం బయట కూడా వీక్షకుల సౌకర్యం కోసం మరో నాలుగు మొబైల్ ఎ‌ల్‌సీడీలు కూడా ఏర్పాటు చేశారు.

శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సభ జరగనున్నా.. సమైక్యవాదులు మాత్రం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సమైక్యవాదులతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే శాశ్వత నష్టాన్ని నిరోధించే లక్ష్యంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి వివిధ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న ఎల్బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా నామకరణం చేశారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువా‌రందరికీ ఒకే రాష్ట్రం కావాలంటూ ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు.

తాజా వీడియోలు

Back to Top