24న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉమ్మారెడ్డి

హైదరాబాద్:

తెలుగు దేశం పార్టీకి మరో కుదుపు. మాజీ మంత్రీ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం అంటే నవంబర్ 23న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలుస్తారు. అనంతరం పార్టీ అధినేత వైయస్ జగన్మోహన రెడ్డితో భేటీ అవుతారు. నవంబర్ 24న పొన్నూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో  వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్లు ఉమ్మారెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా పొన్నూరు నుంచి బాపట్ల వరకూ బైక్ ర్యాలీని నిర్వహిస్తారు.

Back to Top