'16న వైయస్‌ఆర్‌సిపిలో ప్రవీణ్‌రెడ్డి చేరిక'

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా), 13 డిసెంబర్‌ 2012: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఈ నెల 16న నిర్వహించే బహిరంగ సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పాల్గొంటారు. ఇదే సభలో టిడిపి ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు. ఈ విషయం వైయస్‌ఆర్‌సిపి వర్గాలు తెలిపాయి. బి.కొత్తకోటలో నిర్వహించే సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సింగిల్ విండో ఎన్నికల్లో వై‌యస్‌ఆర్ ‌సిపి విజయ దుందుభి మోగిస్తుందని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top