అన్నమయ్య డ్యామ్‌ నిర్మాణంపై స‌ర్కార్‌ నిర్ల‌క్ష్యం

ఎంపీ మిథున్‌రెడ్డి
 

రాజంపేట: కూటమి సర్కార్ అన్నమయ్య డ్యామ్ నిర్మాణాన్ని గాలికొదిలేసిందని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డ్యామ్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, అయితే ఆ టెండర్లను ఈ ప్రభుత్వం రద్దు చేసి ఆ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్నారు.

ఈ డ్యామ్ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు సాగునీరు సమస్య తీవ్రమైందన్నారు మిథున్‌రెడ్డి. ఇప్పటికైనా డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి అంటే 13 గ్రామాలే కాదని, రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుపై ఉందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. 

Back to Top