జిల్లాకు మంచి పేరు తెస్తారని నమ్ముతున్నాం

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

అమరావతి: డిప్యూటి స్పీకర్‌గా సమర్ధవంతంగా పని చేసి గుంటూరు జిల్లాకు మంచి పేరు తెస్తారని నమ్ముతున్నట్లు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికైన సందర్భంగా నిర్వహించిన ధన్యవాద తీర్మానం సభలో మేరుగ నాగార్జున మాట్లాడారు. ఏ పదవి అయిన అర్హత ఉన్న కుటుంబం మీది. మీలాంటి వారు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలతో పని చేస్తారని నమ్మకం ఉంది. ఈ సభను బ్రహ్మండంగా నడపగల సమర్ధత మీకు ఉంది. జిల్లాకు మంచి పేరు తెస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ..మిమ్మల్ని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top