ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టం

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా మ‌న ప్ర‌భుత్వం పాల‌నా వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టం చేసింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. పాల‌న‌, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ నేడు అన్ని దేశాలు పాటిస్తున్న విధానమ‌న్నారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 38, 39 ఇదే విష‌యాన్ని  సూచిస్తు్న్నాయ‌ని చెప్పారు. మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభివృద్ధి, వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టాన్ని తీసుకువచ్చార‌ని, ప్ర‌జాస్వామ్య‌వాదులు, మేధ‌వులు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఈ చ‌ట్టాన్ని స్వాగ‌తించాల‌ని ధ‌ర్మాన కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top