ప్రకాశం జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. వైయస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయల్దేరుతారు. పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖాముఖి అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.