కాసేప‌ట్లో కొండ‌వీడుకు వైయ‌స్ఆర్‌సీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ.. 

కోట‌య్య మ‌ర‌ణంపై ప‌లు అనుమానాలు..

కోటయ్య మరణంపై వాస్తవాలు తెలుసుకునేందుకు  వైయస్‌ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ నేడు గుంటూరు జిల్లా కొండవీడులో  పర్యటించనుంది. సీనియర్‌ నేత ఉమారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ నిజ నిర్ధాకమిటీ వేశారు.కమిటీ సభ్యులుగా గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు శాసన సభ్యులు (ముస్తఫా,  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  ఆళ్ల రామకృష్ణారెడ్డి)లతోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యన్నారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, రజని,  కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ,  లేళ్ల అప్పిరెడ్డి,  గాంధీ,  మేరుగ నాగార్జున ఉంటారు. బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారికి అండగా నిలబడాలని వైయ‌స్ జగన్‌ పార్టీ నాయకులను ఆదేశించారు.

కోటయ్య మృతిపై అనుమానాలు...

కోటయ్య మృతిపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. కోటయ్య పురుగు మందు తాగి ఉంటే నోటి వెంట నురగ వచ్చి ఉండేంది..పోలీసులు రైతును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లి ఉంటే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు..మార్గ మధ్యలోనే గ్రామస్తులక ఎందుకు అప్పగించారు..సీఎం సభ వద్దే అంబులెన్సులు,వైద్యులు ఉన్నా ప్రాథమిక చికిత్స అక్కడే ఎందుకు అందించలేదు..కోటేశ్వరరావు ఇంట్లో పనిచేస్తున్న పున్నారావు నోరు విప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు..పోలీసుల వాహనంలో పునన్నారావును ఎందుకు దాచి ఉంటారు..?అతడి సెల్‌ఫోన్‌ను పోలీసుల వద్దే ఎందుకు ఉంచుకున్నారు..రైతు కోటయ్య మృతికి పోలీసుల కారణం కాకపోతే గ్రామంలోకి ఎవరూ వెళ్లకుడా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది..పోలీసుల తప్పేమీ లేకపోతే రూ.3లక్షలుఉ ఇస్తామంటూ బేరసారాలు ఆడాల్సిన అగత్యం ఏమిటి..?నిజంగా రైతుది ఆత్మహత్యే అయితే అనుమానాస్పద మృతి కింద కేసు ఎందుకు నమోదు చేశారు.పోస్టు మార్టం నివేదిక రాకుండానే రైతుది ఆత్మహత్య అని జిల్లా ఎస్పీ ఎలా చెప్పారు..?

తాజా వీడియోలు

Back to Top