అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ

గుంటూరు:  అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం గుంటూరు లాడ్జీ సెంటర్‌ నుంచి మార్కెంట్‌ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగ నాగార్జున, మద్దాలి గిరి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే అమరావతి పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top