“చలో జువ్వలదిన్నె”పై పోలీసుల ఆంక్షలు 

నెల్లూరు జిల్లా: “చలో జువ్వలదిన్నె” కార్యక్రమానికి పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సహా వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జువ్వలదిన్నె సమీపంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, రాకపోకలను నిలిపివేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేయడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. తమను అడ్డుకోవడం అన్యాయమని, కార్యక్రమానికి పూర్తి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

Back to Top