రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే రాష్ట్రం పతనమైంది

సాయికృష్ణ, క్రాంతి కుమార్ హత్యలతో మళ్లీ నిరూపితమైంది

పోలీసు బాధితులకు న్యాయసహాయం అందించేందుకు సిద్దం 

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ స్పష్టీకరణ

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి 

ప్రభుత్వ పెద్దలకు ప్రైవేటు ఆర్మీగా మారిన పోలీసు వ్యవస్థ

వైయ‌స్ఆర్‌సీపీ, సోషల్ మీడియా తర్వాత ప్రజలపై పడ్డారు

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచే ఇది మొదలైంది

సాయికృష్ణ, క్రాంతి కుమార్ హత్యలతో పరాకాష్టకు చేరింది

పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫైర్ 

సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్నవాళ్లు బయటికి రావాలి

ప్రభుత్వ అండతోనే పోలీసుల దురాగతాలు

అధికార మదంతో చంద్రబాబు, లోకేష్ మాటలు

వాటిని ప్రేరణగా తీసుకుని రెచ్చిపోతున్న పోలీసులు 

పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆక్షేపణ

పోలీసుల సాయంతో ప్రశ్నించే గొంతులపై అణచివేత

పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్ధితుల్లేవు

పోలీసులు కొడితే ఆస్పత్రుల్లో వైద్యం కూడా చేయట్లేదు

బాధితులకు లీగల్ సెల్ అండగా నిలబడుతుంది

జల్లా సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలైనప్పుడే రాష్ట్రం పతనమైందని, సాయికృష్ణ, క్రాంతి కుమార్ హత్యలతో పరిస్ధితి మరింత దిగజారిందని వైయ‌స్ఆర్‌సీపీప్రధాన కార్యదర్శి( లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్రంలో ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే, వారిని ప్రేరణగా తీసుకుంటూ పోలీసులు నేరుగా హత్యలే చేసే స్థాయికి చేరుకున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ప్రభుత్వ, పోలీసు బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ పెద్దలకు ప్రైవేటు ఆర్మీలా పోలీసు వ్యవస్ధ:
పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి(లీగల్ వ్యవహారాలు) 

రాజ్యాంగ బద్దమైన పోలీసు వ్యవస్థను పాలక పక్షం తమ ప్రైవేటు ఆర్మీగా, తమ పార్టీలో ఓ విభాగంగా, తమ సొంత మాఫియా గ్రూపుగా తయారు చేసింది. ముందుగా వైయ‌స్ఆర్‌సీపీ మీద పడ్డారు, ఆ తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, చివరికి ప్రజల మీద కూడా పడ్డారు. సాయికృష్ణ అనే 22 ఏళ్ల వ్యక్తి పోలీసుల చేతుల్లో అతి క్రూరంగా హింసకు గురై చనిపోయిన పరిస్ధితుల్లో సుమారు 50 రోజులుగా మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మా అధినాయకుడు నిద్ర లేపారు. సాయికృష్ణ ఇంటికి వెళ్లి, తల్లిని విచారించి కదన రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం చలించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పతనం కొత్త కాదు. ఇది ఎక్కడ మొదలైందంటే ముఖ్యమంత్రి కుమారుడు వేసిన విత్తనం రెడ్ బుక్ రాజ్యాంగం నుంచే. ఆయన మొదలుపెట్టిన ప్రక్రియ, సృష్టించిన కొత్త ఒరవడి నుంచే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్య పతనం వైపు  దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలకు ఉపయోగపడాల్సిన వారు, వారి బాగోగులు చూడాల్సిన వారి భాష వెంటే బాధేస్తోంది. గుడ్డలిప్పి కొడతాం, వెంట్రుకలు తీసేస్తాం, కళ్లు పీకేస్తాం, డ్రాయర్లు విప్పి నడిరోడ్డు మీద ఉరికిస్తాం, కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాం అనే భాష గతంలో ఎప్పుడూ లేదు. గతంలో ఏ రాజకీయ నాయకుడూ వాడని ఈ భాష వాడినప్పుడే ప్రజాస్వామ్యం పతనమైంది. అది ఇప్పుడు సామాన్య ప్రజల్ని కూడా వదలడం లేదు. 

సాయికృష్ణ హత్య అసలు ముద్దాయిలు బయటికి రావాలి

కృష్ణలంకలో చనిపోయిన సాయికృష్ణది ఒక లాకప్ డెత్ మాత్రమే కాదు, దానికి కారకుడైన నాగరాజు అనే వ్యక్తి కేవలం సాధనం మాత్రమే. అతన్ని ఆడించింది ఎవరనేది బయటికి రావాల్సిందే, ముద్దాయిలు కావాల్సిందే. ఓ సీఐ చేసిన దురాగతం ఉన్నతాధికారులకు తెలియకుండా ఉంటుందా ? అలా ఉంటుందని మభ్యపెట్టదల్చుకున్నారా ? సీఐ నుంచి ఆ  స్టేషన్ లో ఉన్న కానిస్టేబుళ్ల వరకూ ఎవరికీ బాధ్యత లేదని ప్రభుత్వం చెప్పగలదా ? ప్రభుత్వం పోలీసు వ్యవస్థను సొంత ఆర్మీగా వాడుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన స్పూర్తితోనే వీళ్లు ఇలాంటి అరాచకాలకు పాల్పడనున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాళ్లకు స్ధానం ఉందా ? అధికార మదంతో మీరు మాట్లాడిన మాటలు, మీ తాబేదారులు, ప్రైవేటు ఆర్మీ ప్రేరణగా తీసుకుని ప్రజల మీద పడుతున్నారు. మీరు చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్య పతనానికి నాంది పడింది. ఎవరైనా బాధితుడు ఓ పోలీసు స్టేషన్ కు వెళ్లి మీరు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన వారు, ఇక్కడికి రావడానికి అర్హత లేదని చెప్పిన దుర్మార్గమైన వ్యవస్థ ఇది. తిరిగి ప్రజాస్వామ్యాన్ని పట్టాల మీద పెట్టాల్సిన అవసరం ఉంది. కృష్ణలంక సీఐ నాగరాజుపై ఇలాంటి ఫిర్యాదులు కొత్తేమీ కాదు. క్రాంతి కుమార్ అనే ఓ దళితుడు తాను చనిపోవడానికి కొన్ని నిమిషాలకు ముందు వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో రాష్ట్రంలో ప్రతీ పౌరుడూ చూస్తే కడుపు మండిపోతుంది. నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు, నేను బతకలేనమ్మా అంటూ చేతిలో విషపు గుళికలు తీసుకుని నోట్లో వేసుకోకముందు తాను చెప్పిన మాటలు ప్రజలు విని తీరాల్సిందే. ఏ విధంగా వాళ్లు రాష్ట్రంలో దహనకాండ సాగిస్తున్నారో అర్దమవుతుంది. 

ప్రతీకారాల కోసమేనా మీకు అధికారం ?

ఈ రాష్ట్రాన్ని అసలు మనుషులు పాలిస్తున్నారా అని క్రాంతి కుమార్ వీడియో చూస్తే అర్దమవుతోంది. మీకు అధికారం ఇచ్చింది ఇలా క్రూరంగా ప్రతీకారాలు తీర్చుకోవడానికా ? న్యాయ చక్రాలు చాలా నెమ్మదిగా తిరుగుతున్నాయని భ్రమపడకండి, అవి చాలా గట్టిగా పొడి చేస్తాయని అర్దం చేసుకోండి. నేను శాశ్వతం అని ప్రతీ నియంతా బతికాడని చరిత్ర చెబుతోంది. ఏ నియంత కూడా చరిత్రలో ప్రజల్ని ఎల్లకాలం హింసించిన పరిస్ధితి లేదు. అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ప్రతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకు వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు వదిలేయండి, కనీసం సామాన్యులు వెళ్లే పరిస్ధితి ఉందా చెప్పండి. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఎమర్జెన్సీ విధించారు. కానీ ఇది అంతకన్నా దారుణంగా ఉంది. ఏ రౌడీ షీటర్ మాట్లాడకూడని భాషను అత్యున్నత స్ధానంలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాటల స్ఫూర్తినే పోలీసులు ఇవాళ అనుసరిస్తున్నారు. గతంలో తెనాలిలో ముగ్గురు దళిత పిల్లల్ని నడివీధిలో హింసిస్తే ఆ రోజు ప్రజలు మిమ్మల్ని అడగలేకపోయారు. దాంతో మరింత రెచ్చిపోతున్నారు. తెనాలి ఘటన జరిగిన రోజే డీజీపీ మిమ్మల్ని మందలించి ఉంటే ఇప్పుడు ఈ రెండు హత్యలకు తెగబడేవారు కాదు. పెద్ది సుధారాణి అనే మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని, చిత్ర హింసలు పెట్టి, ఊరూరా తిప్పారు. అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేసి, డాక్టర్లతో గాయాలు లేవని రాయించుకున్నారు. మెజిస్ట్రేట్ ఆమె గాయాల్ని గమనించి మరో డాక్టర్ వద్దకు పంపితే జరిగిన విషయం బయటపడింది. 
    
    సాయికృష్ణ హత్యతో కాదు క్రాంతి కుమార్ చావుతో కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలుపెట్టిన రోజే రాష్ట్రం పతనమైంది. మీ కార్యకర్తలకు, పోలీసు వ్యవస్థలకు మీరు ఇచ్చిన స్పూర్తే ఇందుకు కారణం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా, మీరు ఇచ్చిన భరోసా, సహకారమే ఈ ఘటనలకు కారణం. సాయికృష్ణ ఇంటికి మా నాయకుడు వెళ్లిన తర్వాత అంతా షేక్ అయి వ్యవస్ధలో కదలిక వచ్చింది. ఓ నేరస్తుడైన పోలీసు అధికారిని మరో పోలీసు అధికారితో విచారణ చేయిస్తారా ? అలా చేస్తే సాయికృష్ణకు న్యాయం జరుగుతుందా ? పోలీసులు చేసిన లాకప్ డెత్ కేసుల్లో సీబీఐతో విచారణ చేయిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. మీరు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరకపోతే అనుమానాలకు తావిచ్చినట్లే. ఈ పోలీసు స్టేషన్లో జరిగిన దురాగతం పక్క పోలీసు స్టేషన్ వాళ్లతో విచారణ చేయిస్తే న్యాయం జరుగుతుందా ? ఏం చెప్పదల్చుకున్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ? కాబట్టి ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేయించకపోతే వైయ‌స్ఆర్‌సీపీగట్టిగా నిలబడి న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం. వైయ‌స్ఆర్‌సీపీ ఇకపై ప్రతీ అక్రమ అరెస్టుపైనా పోరాడుతుంది. ఆధారాలతో సహా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రతీ పౌరుడూ ఓ సాక్షిగా నిలబడాలి. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి కాబట్టి పోలీసుల దుశ్చర్యల్ని వీడియో రికార్డింగ్స్ చేయండి, మాకు పంపించండి. అక్రమ అరెస్టులపై పోరాడేందుకు సిద్గంగా ఉన్నాం. 

బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్దం:
జల్లా సుదర్శన్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుల్ని నొక్కే క్రమంలో, వాటిని తమ ఉక్కుపాదంపై అణచివేసే క్రమంలో ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఏ పోలీసు స్టేషన్ కు వెళ్లినా బాధితులు ఫిర్యాదు చేసే పరిస్ధితి లేదు. అధికార పక్షం వేధింపులకు గురైన వారు పోలీసు స్టేషన్లకు వెళ్తే ఫిర్యాదులు తీసుకునే పరిస్ధితి లేదు. బాధితుల ఫిర్యాదు తీసుకుని, గాయపడితే ఆస్పత్రులకు పంపే పరిస్ధితి లేదు. బాధితులు ఫిర్యాదు చేసినా ముద్దాయిలపై ఎలాంటి కేసులు లేకపోగా, తిరిగి వాళ్లపైనే కేసులు పెడుతున్నారు. అరెస్టు చేయకూడదని నేరాలున్నా వాటిలో అరెస్టులు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు ఉన్నా పాటించడం లేదు. పోలీసులు కొట్టారంటే ఆస్పత్రుల్లో డాక్టర్లు వైద్యం కూడా చేయట్లేదు. ఇలాంటి పరిస్ధితి మన రాష్ట్రంలోనే ఉంది. గాయపడ్డ వ్యక్తి పోలీసుల సమాచారం లేకుండా ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే హక్కు చట్టంలో ఉంది. అయినా గాయపడ్డ, దెబ్బలు తిన్న వ్యక్తి ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి వెళ్తే, పోలీసుల దెబ్బలు తగిలాయని తెలిసి వైద్యం చేయడం లేదు. పోలీసు వ్యవస్థ ఒకటే నాశనం అయిందనుకుంటే, ఇప్పుడు వైద్యం చేయాల్సిన  డాక్టర్లు కూడా అలాగే తయారయ్యారు. సమాజానికి ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పంపుతోంది ? రాష్ట్రంలో ఇలాంటి పరిస్ధితుల దృష్ట్యా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ విభాగం బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్దంగా ఉంది.  నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని బాధితులకు న్యాయసహాయం అందించే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, ఈ ప్రభుత్వం, పోలీసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటుంటే వాళ్లకు న్యాయసహాయం అందిస్తున్నాం.

Back to Top