బాధిత కుటుంబానికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ 

 నీటి కుంటలో మృతి చెందిన కురువ చిన్న నాగన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 

 కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నంద్యాల జిల్లా: ప్యాపిలి మండలం నల్లమేకలపల్లె గ్రామానికి చెందిన  కురువ చిన్న నాగన్న ఇటీవల గొర్రెలను కాపాడే క్రమంలో నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై స్పందించిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు , డోన్ మండల అధ్యక్షుడు  సోమేశ్ యాదవ్, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు  గజేంద్రనాథ్ రెడ్డి ,  అలెబాద్ బాలయ్య, బోరెడ్డి పుల్లారెడ్డి, వివిధ గ్రామాల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top