తిరువూరులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి
 

 

అమరావతి: పరిపాలన అంటే ఏంటో రెండు మాసాల్లో ప్రజలందరికీ అర్థమయ్యేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గం తెలంగాణ సరహద్దులో ఉందని, నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, డయాలసిస్‌ రోగులు కూడా ఎక్కవగా ఉన్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, తిరువూరును నియోజకవర్గ హెడ్‌ క్వార్టర్‌ చేయాలని కోరారు. అదే విధంగా తండాలు ఎక్కవగా ఉన్నాయని, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

Back to Top