భౌతిక దూరం పాటించమంటే బాబు 600 కి.మీ దూరం వెళ్లారు

విశాఖ బా«ధితులను సీఎం వైయస్‌ జగన్‌ సొంత బంధువులా ఓదార్చారు

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

వైయస్‌ఆర్‌ జిల్లా: కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని చెబితే..ప్రతిపక్ష నేత చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని చెప్పారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిలోకి తీసుకువచ్చిందన్నారు.సొంత బంధువులా సీఎం వైయస్‌ జగన్‌ బాధఙత కుటుంబాలను ఓదార్చారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండుంటే పబ్లిసిటీ కోసమే వందల కోట్లు ఖర్చే చేసేవారన్నారు.
 

Back to Top