వైయ‌స్ఆర్ జ్ఞాప‌కాలు ఎప్పుడూ గుర్తుంటాయి

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కాలు ఎప్పుడు గుర్తుంటాయ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానేత విగ్ర‌హానికి బొత్స స‌త్యనారాయ‌ణ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  తండ్రిబాట‌లోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమాన్ని కొన‌సాగిస్తున్నార‌ని బొత్స పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌తో ప‌ని చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని  చెప్పారు. వైయ‌స్ఆర్ లేని లోటు తీర్చ‌లేనిద‌ని,  ఆయ‌న ఆలోచ‌న‌ల‌తో మేం ప‌ని చేస్తున్నామ‌ని తెలిపారు. వైయ‌స్ఆర్ ఆశీస్సుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నార‌ని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top