అమరావతి పేరుతో భ్రమరావతి

ఎమ్మెల్యే కిలారు రోశయ్య
 

అమరావతి: చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమరావతి నిర్మించారని ఎమ్మెల్యే కిలారు రోశయ్య విమర్శించారు. భ్రమరావతి నిర్మాణాల్లో స్థానికులకు ఉపాధి లేదని తెలిపారు. చంద్రబాబు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని బిల్లు రూపొందించడం అభినందనీయమని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రోశయ్య తెలిపారు.
 

Back to Top