వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా

నంద్యాల జిల్లా:  గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డిలను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పరామర్శించారు. గత నెలలో బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం జిల్లెల్ల గ్రామంలోని తమ నివాసాలకు చేరుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

Back to Top