శిరోముండనం వ్యవహారంలో 24 గంటల్లో కేసు నమోదు చేశాం

హోం మంత్రి మేకతోటి సుచరిత
 
పోలీసులను అభినందించిన హోంమంత్రి

గుంటూరు: వైజాగ్ లో దళిత యువకుడికి శిరోముండనం కేసులో కేవలం 24 గంటల లోపు నిందితులపై కేసు నమోదు చేసిన‌ట్లు హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు.  ఈ అంశంలో వైజాగ్ నగర పోలీసుల పనితీరు అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా దళితులపై అఘాయిత్యాలు, హింసకు పాల్పడితే సహించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.వైజాగ్ లో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం జరగడం తెలిసిందే.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top