20వ రోజు `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర ప్రారంభం

అనకాపల్లి జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 20వ రోజు చిన్న‌య‌పాలెం నుంచి ప్రారంభ‌మైంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి వైయస్ జగన్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైంది. 20వ రోజు బ‌స్సు యాత్ర‌ పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్‌ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంత‌రం గోపాలపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు. 

చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు క‌లిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేరుపేరునా పలకరిస్తూ..వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు ముఖ్య‌మంత్రి దిశానిర్దేశం చేశారు. 

Back to Top