చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నా...

వైయస్‌ జగన్‌కు ఐటిడిఎ ఉద్యోగుల మొర
శ్రీకాకుళంః ఐటిడిఎ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. జననేతకు వినతిప్రతం సమర్పించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదన్నారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు.ప్రసూతి సెలవులు ఆరునెలలు ఇవ్వాలని కోరారు.అధికార ప్రభుత్వానికి పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలు పట్ల జననేత సానుకూలంగా స్పందించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారన్నారు.  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు.  
 
Back to Top