<strong>టీడీపీ పాలనలో కళాకారులకు ఆదరణ కరవు..</strong><strong>వైయస్ జగన్‌ను కలిసిన మృదంగ కళాకారులు..</strong>శ్రీకాకుళంః కళారంగానికి చేయూత కరువయిందని మృదంగం కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాల వలస శివారు శివ సంతోషి నగర్‌లో ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వైయస్‌ఆర్ హయాంలో మంచి ప్రోత్సహం లభించేందని,టీడీపీ ప్రభుత్వం పాలనలో ఆదరణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.సంప్రదాయక కళా రంగం నిలబడ్డాలంటే ప్రభుత్వ ఆదరణ ఉండాలన్నారు.కళ కాలకాలం బతకాలంటే ప్రభుత్వ తోడ్పాటు అవసరమన్నారు.కళలలో డిప్లామాలు చేసిన వారికి జీవన భృతి కల్పించాలని కోరారు. కళాకారులు సమాజంలో గౌరవంగా జీవించాలనే సంకల్పంతో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేయూత నిచ్చారన్నారు.ప్రతి ఏడాది హైదరాబాద్ వేదికగా కళాకారులను కలిసే ఏర్పాటు చేసేవారన్నారు. ప్రోత్సహాకాలు ఇచ్చి సత్కరించేవారని గుర్తు చేసుకున్నారు.వైయస్‌ఆర్ లేకపోవడం కళాకారులకు తీరని లోటు అని అన్నారు.