భలే మంచి చౌకబేరము

రాష్ట్రం భలే మంచి చౌక బేరంలో ఉంది. రాష్ట్రానికి
సిఇఓనని చెప్పుకునే బిజినెస్ మెన్ బాబు నిజంగానే తన లక్షణాలను అక్షరాలా ఆచరించి
చూపిస్తున్నాడు. రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకోవడం, అయినకాడికి అమ్ముకోవడమే
పనిగా పెట్టుకున్నాడు. నిధులు లేవు, కేంద్రం తనని నమ్మి వేరేమీ ఇవ్వడం లేదు గనుక దేవుడి
మాన్యాలుగా ఉండే భూములను అమ్మేసుకుందాం అంటున్నాడు. ఎలాగూ కబ్జాల పాలౌతున్నాయి
గనక, వాటి రక్షణ గురించి ఆలోచించే పని లేకుండా అమ్మేసుకుంటే పోలా అంటున్నాడు. బాబు
అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవి అమ్ముకుందా, ఎంత సొమ్ము చేసుకుందాం అన్న
యావలోనే ఉన్నాడు. గతంలో నిరర్థక ఆస్తులు అంటూ ప్రభుత్వ సంస్థలను, ఫ్యాక్టరీలను,
భూములను అమ్మేసిన చంద్రబాబుకు మళ్లీ అదే పురుగు తొలుస్తున్నట్టుంది. ఎన్డీయే
ప్రభుత్వ రాష్ట్రం కోసం ఇచ్చిన నిధులన్నీ గుటకాయస్వాహా అయ్యాయి. పోలవరం, పట్టిసీమ
వంటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు దండేసుకోవడంతో అవి వట్టిపోయిన ఆవులయ్యాయి. రాష్ట్రంలో
కంటికింపుగా, బేరానికి అనువుగా ఉన్నవన్నీ అమ్మేశారు. ఇసుకను తోడి పక్క రాష్ట్రాలకు
కూడా అమ్ముకున్నారు. మట్టిని ప్రొక్లేయిన్లతో తవ్వి సొమ్ము తోడి పోసుకుంటున్నారు. ఎర్ర
చందనం దుంగల్ని వేలం వేసి వందల కోట్లు దండుకున్నారు. అవినీతిని కూడా అమ్ముకోవడం
చంద్రబాబు నుంచే నేర్చుకోవాలి. అక్రమ నిర్మాణాలకు పన్నులు వేసి, రెగ్యులరైజేషిన్
పేరిట వేల కోట్లు సంపాదించడం. అంటే ఓ విధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను కూడా
అమ్ముకుని సొమ్ము చేసుకోవడమన్నమాట.

ఎంత సేపూ ప్రైవేటు పెట్టుబడి దారులు, వాళ్ల
పెట్లుబడుల కోసం హైరానాలు, వారికి కారు చౌకగా భూములు, అన్ని రకాల అనుమతులు
ఇచ్చేయడం, అందుకు ప్రతిగా వాళ్లు విదిల్చినవో, రాల్చినవో ఏరుకోవడం. రియలెస్టేట్
డీల్స్ చేస్తూ ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేస్తున్న దందా మామూల్ది కాదు. చెట్టు,
పుట్టా, మన్నూ, మిన్నూ కూడా అమ్మేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రాన్నే పరాయి
చేసేట్టున్నాడు చంద్రబాబు. త్వరలో తిరుపతి కొండల్ని, నల్లమల అడవుల్ని, రాష్ట్రంలో
ప్రజలనీ వేలంలో ప్రైవేటు సంస్థలకు నేరుగా అమ్మేస్తానన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆదాయం కోసం అమ్మకమొకటే దారా?

రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కావాలి. నిధులు
కావాలంటే ఉన్నవన్నీ అమ్ముకోవాలి ఇదీ చంద్రబాబు విధానం. ప్రభుత్వం పరిశ్రమలు
పెట్టడం మానేసి, ఉన్నవాటిని మూయించే విష సంస్కృతికి చంద్రబాబు ఆద్యుడు. చక్కెర
ఫ్యాక్టరీలు, డెయిరీ ఫామ్ లు, చేనేత, హస్తకళ, కుటీర, చిన్నతరహా పరిశ్రమలన్నిటినీ బాబు
కాలరాసేశాడు. స్వయం సమృద్ధి, స్వయం ఉపాధీ లేకుండా చేసాడు. ఏం కావాలన్నా
ప్రభుత్వంపై ఆధారపడే స్థితిలోకి ప్రజలను నెట్టేశాడు. మీకోసమే పథకాలు అంటూ
ప్రకటించి, వాటి కోసం నిథుల సమీకరణ అంటూ ప్రైవేటు సంస్థలకు రాష్ట్రాన్ని తాకట్టు
పెట్టేస్తున్నాడు. ఉపాధినిచ్చే పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావు. మల్టీప్లెక్సులు,
వినోద కేంద్రాలు, విలాస వస్తువుల తయారీ కేంద్రాలకు రాష్ట్రాన్ని
రాసిచ్చేస్తున్నాడు చంద్రబాబు.

రాచరికంలో రాజుల సొమ్ము రాళ్లపాలైతే, చంద్రబాబు
హయాంలో ప్రజల సొమ్ము పాలకు, ప్రైవేటు కంపెనీల పాలు అని చెప్పుకోవాలి. 

Back to Top